Sixers Record: టెస్టుల్లో భారత్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టిన ఇంగ్లాండ్.. అదేమిటంటే..?
2021లో భారత్ 14 టెస్టు మ్యాచ్‌ల్లోనే అత్యధికంగా 87 సిక్సర్లు కొట్టి రికార్డు సృష్టించింది. అయితే భారత్ పేరిట ఉన్న ఆ రికార్డును పాకిస్థాన్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బద్దలు కొట్టింది. ఆ వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Dec 18, 2022 | 4:14 PM

పాకిస్థాన్‌తో కరాచీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో.. ఒక క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక సిక్సర్లు బాదిన భారత్(2021) రికార్డును ఇంగ్లండ్ బద్దలు కొట్టింది.

2021లో భారత్ 14 టెస్టు మ్యాచ్‌ల్లో అత్యధికంగా 87 సిక్సర్లు కొట్టి నయా రికార్డును లిఖించింది. అయితే పాకిస్థాన్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఈ క్యాలెండర్ ఇయర్‌లో 88 సిక్సర్లు కొట్టడంతో భారత్ పేరిట ఉన్న రికార్డును తిరగరాసింది.

2014లో న్యూజిలాండ్ ఆడిన 9 టెస్టు మ్యాచ్‌ల్లో ఆ టీమ్ 81 సిక్సర్లు కొట్టింది. ఇక భారత్ 2021లో న్యూజిలాండ్(2014) పేరిట ఉన్న రికార్డును భారత్ బద్దలు కొట్టింది.

కరాచీ టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 304 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. దీనికి సమాధానంగా ఇంగ్లండ్ జట్టులో హ్యారీ బ్రూక్ మరోసారి సెంచరీ సాధించాడు.

హ్యారీ బ్రూక్ కరాచీ టెస్ట్‌లో తన సెంచరీని చేరుకోవడానికి మూడు సిక్సర్లు కొట్టాడు. దీంతో ఇంగ్లండ్ ఒక క్యాలెండర్ ఇయర్‌లో భారత్ పేరిట ఉన్న 87 సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టడంలో సహాయపడింది.




