18 ఏళ్లకే అరంగేట్రం.. ఫైరింగ్ బౌలింగ్‌తో స్టార్ ప్లేయర్లకు చుక్కలు.. తొలి మ్యాచ్‌లోనే ప్రపంచ రికార్డు సృష్టించిన యంగ్ బౌలర్..
Rehan Ahmed: ఇంగ్లండ్ బౌలర్ రెహాన్ అహ్మద్ తన అరంగేట్రం మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. 5 వికెట్లు తీసిన అతి పిన్న వయస్కుడైన ఇంగ్లిష్ బౌలర్‌గా సరికొత్త రికార్డులు లిఖించాడు.
ENG vs PAK 3rd Test: పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో పాకిస్థాన్ తన రెండో ఇన్నింగ్స్‌లో 216 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లిష్ బౌలర్ రెహాన్ అహ్మద్ దెబ్బకు పాకిస్థాన్‌ను విలవిల్లాడుతూ, తక్కువ స్కోరుకే చేతులెత్తేసింది. ఈ ఇంగ్లీష్ బౌలర్ రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీశాడు. దీంతో అరంగేట్రం మ్యాచ్ ఆడుతున్న రెహాన్ అహ్మద్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ తరపున అరంగేట్రం టెస్టు మ్యాచ్‌లో రెహాన్ అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో రెహాన్ 48 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.
స్టార్ బ్యాట్స్‌మెన్‌లను సైతం గడగడలాడించాడు..
ఈ ఇన్నింగ్స్‌లో పాక్ స్టార్ బ్యాట్స్‌మెన్‌లను రెహాన్ పెవిలియన్‌కు పంపాడు. ఇందులో పాక్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ (54), సౌద్ షకీల్ (53), వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్ (7), అఘా సల్మాన్ (21), వసీం జూనియర్ (2)లను పెవిలియన్ చేర్చాడు. అతని టెస్టు అరంగేట్రం రెహాన్‌కు చిరస్మరణీయంగా మారింది.
ప్రపంచంలో ఆరో స్థానం..
అరంగేట్రంలోనే 5 వికెట్లు తీసిన అతి పిన్న వయస్కుల్లో రెహాన్ అహ్మద్ ఆరో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం ఈ విషయంలో పాకిస్థాన్‌కు చెందిన ఉల్ ఘనీ నంబర్‌వన్‌గా ఉన్నారు. అతను 1958లో పాకిస్థాన్ తరపున టెస్టుల్లో అరంగేట్రం చేసి, 16 ఏళ్ల 303 రోజుల వయసులో ఐదు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత, ఈ విషయంలో పాక్ బౌలర్ నసీమ్ షా రెండో స్థానంలో ఉన్నాడు. 16 ఏళ్ల 307 రోజుల వయసులో 2019లో పాకిస్థాన్ తరపున అరంగేట్రం చేస్తూ 5 వికెట్లు పడగొట్టాడు.
మరో పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ మూడో స్థానంలో ఉన్నాడు. 2009లో 17 ఏళ్ల 257 రోజుల వయసులో పాకిస్థాన్ తరపున అరంగేట్రం చేసి 5 వికెట్లు తీశాడు. ఆ తర్వాత ఎనాముల్ హక్ జూనియర్ (18 ఏళ్ల 32 రోజులు), న్యూజిలాండ్‌కు చెందిన డేనియల్ వెట్టోరీ (18 ఏళ్ల 46 రోజులు) నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. ఇప్పుడు రెహాన్ అహ్మద్ 18 ఏళ్ల 126 రోజుల వయసులో ఈ ఘనత సాధించిన ఆరో బౌలర్‌గా నిలిచాడు.
రెహాన్ ప్రపంచ రికార్డు..
The youngest ever Men’s Test cricketer to take a five-fer on debut ?
?? #PAKvENG ??????? pic.twitter.com/FxCnFLzzOg
— England Cricket (@englandcricket) December 19, 2022
అరంగేట్రం మ్యాచ్ ఆడుతున్న రెహాన్ అహ్మద్ పాక్ జట్టును ఓటమి అంచుల్లోకి నెట్టడంలో కీలక పాత్ర పోషించాడు. పాక్ రెండో ఇన్నింగ్స్‌లో రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్ రెహాన్ అహ్మద్ 48 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. దీంతో పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో 216 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో అరంగేట్రం టెస్టులోనే ఐదు వికెట్లు తీసిన అతి పిన్న వయస్కుడైన బౌలర్‌గా రెహాన్ అహ్మద్ నిలిచాడు. రెహాన్ అహ్మద్, 18 సంవత్సరాల 216 రోజులతో రికార్డ్ నెలకొల్పి, ఆస్ట్రేలియాకు చెందిన పాట్ కమిన్స్‌ను వెనక్కునెట్టాడు.
అండర్-19 ప్రపంచకప్‌లోనూ అద్భుతాలు..
ఇంగ్లండ్ తరపున టెస్టుల్లో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడైన బౌలర్ రెహాన్ అహ్మద్. అలాగే, టెస్టు అరంగేట్రంలోనే ఒక ఇన్నింగ్స్‌లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన 53వ ఇంగ్లండ్ బౌలర్‌గా రెహాన్ అహ్మద్ నిలిచాడు. అదే సిరీస్‌లో అరంగేట్రం చేసిన విల్ జాక్వెస్ కూడా ఈ ఘనత సాధించాడు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఐసీసీ అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచకప్‌లో రెహాన్ నాలుగు మ్యాచ్‌ల్లో 12.58 సగటుతో 12 వికెట్లు పడగొట్టాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..