Rohit Sharma: బంగ్లాతో జరిగే రెండో టెస్ట్ నుంచి కూడా ‘హిట్ మ్యాన్’ అవుట్.. జట్టులోకి ఎప్పుడు తిరిగి వస్తాడంటే..

గాయం కారణంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి టెస్ట్‌కు దూరంగా ఉన్న టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ రెండో మ్యాచ్‌లో కూడా ఆడనట్లే. గాయ నుంచి పూర్తిగా కోలుకోని రోహిత్ శర్మ భారత్‌లోనే చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో అతను బంగ్లాతో జరిగే రెండో టెస్ట్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండడు. రోహిత్ శర్మ గాయం కారణంగా మొదటి టెస్ట్‌లో టీమ్ పగ్గాలు అందుకున్న కేఎల్ రాహుల్ రెండో మ్యాచ్‌లో కూడా కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. అంతేకాక రెండో టెస్టులోనూ రోహిత్ […]

Rohit Sharma: బంగ్లాతో జరిగే రెండో టెస్ట్ నుంచి కూడా ‘హిట్ మ్యాన్’ అవుట్.. జట్టులోకి ఎప్పుడు తిరిగి వస్తాడంటే..
Rohit Sharma
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 19, 2022 | 2:05 PM

గాయం కారణంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి టెస్ట్‌కు దూరంగా ఉన్న టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ రెండో మ్యాచ్‌లో కూడా ఆడనట్లే. గాయ నుంచి పూర్తిగా కోలుకోని రోహిత్ శర్మ భారత్‌లోనే చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో అతను బంగ్లాతో జరిగే రెండో టెస్ట్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండడు. రోహిత్ శర్మ గాయం కారణంగా మొదటి టెస్ట్‌లో టీమ్ పగ్గాలు అందుకున్న కేఎల్ రాహుల్ రెండో మ్యాచ్‌లో కూడా కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. అంతేకాక రెండో టెస్టులోనూ రోహిత్ స్థానంలో శుభ్‌మన్ గిల్ర్‌ ఎపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. బంగ్లా పర్యటనలో ఉన్న భారత్ ఆ దేశంతో ఆడిన రెండో వన్డే మ్యాచ్‌లో రోహిత్‌కు గాయమైంది.

ఇక గాయం కారణంగా మూడో వన్డేకి దూరంగా ఉన్న రోహిత్ మొదటి టెస్ట్ సమయంలో చికిత్స కోసం భారత్‌కు తిరిగి వచ్చాడు. చికిత్స పూర్తయి రెండో టెస్టులో రోహిత్ ఆడతాడని అందరూ భావించారు. కానీ గాయం నుంచి అతను పూర్తిగా కోలుకోనందున ఈ నెల 22న జరిగే రెండో మ్యాచ్‌కు కూడా రోహిత్ దూరంగా ఉంటాడు. టెస్టు సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్ డిసెంబర్ 22 నుంచి మీర్పూర్‌లో బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్ మ్యాచ్ ఆడనుంది.

శ్రీలంకతో జరిగే సిరీస్‌లో పునరాగమనం..

గాయం కారణంగా బంగ్లా నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన రోహిత్ శర్మ ప్రస్తుతం ముంబైలో చికిత్స పొందుతున్నాడు. రోహిత్‌కు బ్యాటింగ్‌ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకపోయినా.. ఫీల్డింగ్ సమస్య కారణంగా అతనికి సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చినట్లు సమాచారం. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టుకు దూరమైన రోహిత్, శ్రీలంకతో వచ్చే జనవరిలో జరిగే వైట్-బాల్ సిరీస్ కోసం మైదానంలోకి తిరిగి రానున్నాడు. జనవరి 3 నుంచి శ్రీలంకతో టీమ్ ఇండియా స్వదేశంలోనే 3 టీ20లు, 3వన్డేల సిరీస్‌లు ఆడనుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో