KIM in FIFA World Cup: ఫిఫావరల్డ్‌కప్‌ స్టేడియంలో కిమ్‌ ప్రత్యక్షం.. నెక్స్ట్ వరల్డ్ కప్ నిర్వహణ లాబీయింగ్ కోసం వచ్చానంటూ హల్ చల్

లూసెయిల్ స్టేడియం లో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌జాంగ్‌ ఉన్‌ ప్రత్యక్షమయ్యారు. ఒక సాధారణ పౌరుడిలా ఫిఫా ఫైనల్స్‌ చూసేందుకు వచ్చిన అతనినిచూసిన ప్రజలు ఒక్క క్షణం ఆశ్చర్యపోయారు. అతన్ని చూడగానే ఫోటోగ్రాఫర్స్‌ అందరూ చుట్టుముట్టారు.

KIM in FIFA World Cup: ఫిఫావరల్డ్‌కప్‌ స్టేడియంలో కిమ్‌ ప్రత్యక్షం.. నెక్స్ట్ వరల్డ్ కప్ నిర్వహణ లాబీయింగ్ కోసం వచ్చానంటూ హల్ చల్
Kim In Fifa World Cup
Follow us

|

Updated on: Dec 19, 2022 | 5:02 PM

ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన ఫిఫా వరల్డ్‌ కప్‌ ఫైనల్ ముగిసింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌పై అద్భుత విజయం సాధించింది అర్జెంటీనా. కాగా ఈ ఫైనల్‌ మ్యాచ్‌ను చూసేందుకు దేశ విదేశాలనుంచి ఎందరెందరో ప్రముఖులు, సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ క్రమంలో లూసెయిల్ స్టేడియం లో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌జాంగ్‌ ఉన్‌ ప్రత్యక్షమయ్యారు. ఒక సాధారణ పౌరుడిలా ఫిఫా ఫైనల్స్‌ చూసేందుకు వచ్చిన అతనినిచూసిన ప్రజలు ఒక్క క్షణం ఆశ్చర్యపోయారు. అతన్ని చూడగానే ఫోటోగ్రాఫర్స్‌ అందరూ చుట్టుముట్టారు. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

అయితే అతను కిమ్‌ కాదు.. అచ్చం కిమ్‌లా ఉన్న ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తి. అతని పేరు హొవార్డ్‌ ఎక్స్‌. చైనామూలాలు ఉన్న ఆస్ట్రేలియా పౌరుడు. కాగా ఖతర్‌లో జరుగుతున్న వరల్డ్‌ కప్‌ తనకు చాలా ఆనందాన్నిచ్చిందని చెప్పాడు. అందుకే ఫైనల్స్‌ ప్రత్యక్షంగా చూడ్డమే కాకుండా, 2030లో ఉత్తరకొరియాలో జరగబోయే ఫిఫా వరల్డ్‌ కప్‌ నిర్వహణకు సంబంధించి లాబీయింగ్‌ చేయడానికి వచ్చానని వివరించాడు. అందుకు సంబంధించిన వీడియో కూడా విడుదల చేశాడు. కాగా హొవార్డ్‌ గతంలో బ్రెజిల్‌, రష్యాలో జరిగిన ఫిఫా వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లకు కూడా తాను హాజరయ్యానని చెప్పాడు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే, హొవార్డ్ వృత్తిరీత్యా సంగీత ద‌ర్శకుడు. ఉత్తర‌కొరియా అధ్యక్షుడు కిమ్‌కి తనకు చాలా దగ్గరి పోలికలు ఉండటంతో త‌ర‌చూ కిమ్‌ను అనుక‌రిస్తూ ఉంటాడట. అలాగ‌ని కిమ్ జాంగ్ గురించి గొప్పగా చెప్పడం అత‌ని ఉద్దేశం కాదని, కిమ్‌ను విమ‌ర్శిస్తూ, వ్యంగ్యంగా జోకులు వేసేందుకే కిమ్‌ను ఇమిటేట్ చేస్తాన‌ని హొవార్డ్ వెల్లడించాడు. ఇత‌ను 2018లో పెయింగ్ చాంగ్‌లో జ‌రిగిన వింట‌ర్ ఒలింపిక్స్‌లో ఉత్తర కొరియా చీర్ లీడ‌ర్స్‌ను క‌లిశాడు. దాంతో ప్రపంచ దృష్టిని ఆక‌ర్షించాడు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..