Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NTR Statue: అమెరికాలో తొలిసారిగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్న నార్త్ అమెరికా సీమ ఆంధ్రా అసోసియేషన్

నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ ఆలోచన యునైటెడ్ స్టేట్స్‌లోని మిలియన్ల మంది తెలుగు అభిమానులను ప్రేరేపించింది. తమ మద్దతును ప్రకటించారు. 

NTR Statue: అమెరికాలో తొలిసారిగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్న నార్త్ అమెరికా సీమ ఆంధ్రా అసోసియేషన్
Ntrt Statue In America
Follow us
Surya Kala

|

Updated on: Dec 19, 2022 | 4:32 PM

2023లో శతాబ్ది ఉత్సవాల సందర్భంగా లెజెండరీ నటుడు నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ప్రతిష్ఠాపన చేయనున్నారు నార్త్ అమెరికా సీమ ఆంధ్రా అసోసియేషన్. ఈ మేరకు న్యూ జెర్సీలోని ఎడిసన్ సిటీలో భూమిని కేటాయించడానికి ఎడిసన్ సిటీ మేయర్ అంగీకరించారు.  ఎన్టీఆర్ తెలుగు సినిమాలో అత్యంత ప్రసిద్ధ నటుల్లో నిస్సందేహంగా ఒకరు. అంతేకాదు ఎన్టీఆర్ తన నాయకత్వ పటిమతో  భారతదేశపు గొప్ప నాయకులలో ఒకరిగా ఖ్యాతిగాంచారు.

ఎన్టీఆర్‌కి అక్కడ ఉన్న ప్రతి తెలుగు వారి హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. భారతీయ చలనచిత్రంలో ప్రముఖ నిర్మాత,  వ్యవస్థాపకుడు T.G. విశ్వప్రసాద్ శతాబ్ది ఉత్సవాల సందర్భంలో భాగంగా న్యూజెర్సీలోని ఎడిసన్ సిటీలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించే ప్రతిపాదనను చేశారు. నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ ఆలోచన యునైటెడ్ స్టేట్స్‌లోని మిలియన్ల మంది తెలుగు అభిమానులను ప్రేరేపించింది. తమ మద్దతును ప్రకటించారు.

ఎడిసన్ మేయర్ సామ్ జోషి ఈ ప్రతిపాదనను సమీక్షించిన తర్వాత అంగీకరించారు. అంతేకాదు ఎన్టీఆర్ విగ్రహాన్ని స్థాపించడానికి నగరంలో సరైన స్థలం కోసం వెతకమని అతని బృందాన్ని ఆదేశించారు. మేయర్ సామ్ జోషి ఎడిసన్ నగరంలో భారత దేశానికి చెందిన మొదటి మేయర్.

ఇవి కూడా చదవండి

అంతేకాదు యునైటెడ్ స్టేట్స్‌లో పబ్లిక్ ప్లేస్ లో ఎన్టీఆర్ మొదటి విగ్రహం ఇదే కానుంది. ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవ కార్యక్రమాలు, సంస్కరణలను తెలుగు ప్రజలు ప్రతిచోటా గుర్తుంచుకుంటారు. ఇప్పుడు, పబ్లిక్ ప్లేస్ లో ఆయన విగ్రహం ప్రతిష్టించడం ప్రతి భారతీయుడు, ప్రత్యేకించి తెలుగు ప్రజలు గర్వించేలా మరొక గొప్ప విజయం అవుతుంది. ఇది భారతీయ వైభవాన్ని ప్రపంచమంతటా ప్రదర్శించడానికి మార్గం అవుతుందని ఎన్నారైలు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం NASAA (నార్త్ అమెరికన్ సీమ ఆంధ్రా అసోసియేషన్) నిధులు సమకూరుస్తుంది. ఎడిసన్ నివాసితులు సహా యునైటెడ్ స్టేట్స్‌లోని అనేక మంది నివాసితులు ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చారు. అట్లూరి, స్వాతి అట్లూరి, నాసా, తానా సంస్థ, ముఖ్యంగా అంజియ చౌదరి, రవి పొట్లూరి తానా 2023 కన్వెన్షన్ చైర్‌కు చెందిన పలువురు వాలంటీర్లు ఉన్నారు.

ఎన్టీఆర్ ప్రపంచ వ్యాప్తంగా.. తెలుగు వారికి గుర్తింపునిచ్చారు, మనం గొప్పగా గర్వించదగిన ప్రజలమని ప్రపంచానికి చాటి చెప్పారు, ఇప్పుడు ప్రతి తెలుగువాడు శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆ లెజెండ్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

మరిన్ని గ్లోబల్ ఇండియన్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి