Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కుక్కపై రాక్షసానందం ప్రదర్శించిన వ్యక్తి.. భరతం పట్టిన ఆవు.. తగిన శాస్తి చేసింది..

ఇప్పటి వరకు 6 లక్షల వ్యూస్‌, టన్నుల కొద్దీ లైక్‌లు వచ్చాయి. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. జంతు వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారికి ఇది మంచి గుణపాఠం అని మరొకరు ట్విట్‌ చేశారు.

Viral Video: కుక్కపై రాక్షసానందం ప్రదర్శించిన వ్యక్తి.. భరతం పట్టిన ఆవు.. తగిన శాస్తి చేసింది..
Cow Revenge
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 20, 2022 | 6:56 PM

నేటి ప్రపంచంలో సోషల్ మీడియా మన జీవితాలతో ముడిపడి పోయింది. ఇంటర్నెట్ ఒక ప్రత్యేక ప్రపంచంలా పనిచేస్తుంది. ఇక్కడ మనం చాలా విభిన్న విషయాల గురించి తెలుసుకుంటున్నాం. ఇక్కడ షేర్ చేయబడిన వార్తలు, ఫోటోలు, వీడియోలు మనకు అనేక సందేశాలను అందిస్తాయి. ఇది ఉపయోగకరమైన సమాచారంతో పాటు వినోద మార్గం కూడా. ఇంటర్నెట్‌లో షేర్ చేయబడిన వీడియోలు మన దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనే టెన్షన్‌ల నుండి కాస్త రిలాక్స్ అవ్వడానికి సహాయపడతాయి. వీటిలో జంతువుల వీడియోలకు వారి స్వంత అభిమానుల సంఖ్య ఉంది. జంతువుల ప్రపంచంలో మనం నమ్మలేని, దగ్గరగా చూడలేని అనేక సందర్భాలను ఇంటర్‌నెట్‌ ప్రపంచంలో చూస్తాము.

అలాగే, ప్రపంచంలో అనేక రకాల వ్యక్తులు ఉన్నారు. ఒకవైపు కొంతమంది నిరాశ్రయుల పట్ల ప్రేమతో ఆదరిస్తున్నారు. వారికి సహాయం చేయడానికి వారు తమ ప్రాణాలను పణంగా పెడతారు. మరోవైపు, కారణం లేకుండా జంతువులను హింసించే కొందరు దుర్మార్గులు కూడా ఉన్నారు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వీళ్లు చేసే కొన్ని వక్రబుద్ధి పనులను చూస్తుంటాం .

ఇవి కూడా చదవండి

జంతువులపై మనుషులు చేసే అకృత్యాలకు నెటిజన్లు కలవరపడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా, అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో షేర్ చేయబడింది. ఇది చూసేవారికి చాలా ఆశ్చర్యంగా, షాకింగ్‌ కూడా ఉంది. అయితే, వీడియో చివరలో ఏం జరిగిందో తెలిస్తే, నోరెళ్లబెడతారు. వీడియో పాతదే అయినప్పటికీ ప్రస్తుతం సోషల్ మీడియాలో మరోమారు వైరల్‌ అవుతోంది. అందులో ఒక వ్యక్తి తన మూర్ఖపు చర్యతో మనుషుల్లో మానవత్వానికి మచ్చను తెచ్చేలా చేశాడు. ఆ వీడియోలో కనికరం లేని ఓ వ్యక్తి కుక్కను రెండు చెవులను పట్టుకుని నిర్దాక్షిణ్యంగా కొట్టడం మనకు కనిపిస్తుంది. ఈ వీడియో మీ రక్తాన్ని ఉడికిస్తుంది.

సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియో చూసిన నెటిజన్ల గుండెలు బద్దలవుతున్నాయి. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియోలో, ఒక వ్యక్తి అమాయక కుక్కను దాని చెవి పట్టుకుని పైకి లేపాడు. అందులో కుక్క నొప్పితో మూలుగుతూ కనిపించింది. ఇది చూస్తే మన రక్తం ఉడికిపోతుంది. దీంతో చలించిన పోయిన మరో మూగజీవి ఆవు కుక్కకి సహాయం చేయడానికి వచ్చింది.

సాయం కోసం ఏడుస్తున్న కుక్కను రక్షించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో.. మరో జంతువు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. వీడియోలో, ఒక ఆవు కుక్కకు సహాయం చేయడాన్ని చూడవచ్చు. కుక్కపై జరిగిన క్రూరత్వాన్ని చూసిన ఆవు గుండెలేని మనిషిపై కొమ్ములతో దాడి చేస్తుంది. ఆపై అతన్ని దూరంగా విసిరివేసింది. తనపై దాడి చేసిన తర్వాత ఆ వ్యక్తి కుక్కను వదిలేశాడు.

ఆ వీడియోలో ఐఎఫ్‌ఎస్ అధికారి సుశాంత్ నందా, ‘హృదయం లేని వ్యక్తి చేసిన పనికి… కర్మకు శిక్ష పడింది’ అని క్యాప్షన్‌లో రాశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు 6 లక్షల వ్యూస్‌, టన్నుల కొద్దీ లైక్‌లు వచ్చాయి. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. జంతు వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారికి ఇది మంచి గుణపాఠం అని మరొకరు ట్విట్‌ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి