Walking Fish: మంచు మీద నడిచే అతిపెద్ద చేప! వీడియో చూస్తే మీ కళ్లను మీరే నమ్మలేరు..

పసిఫిక్ మహాసముద్రంలో కనిపించే జీవి అట్లాంటిక్ మహాసముద్రంలో కనిపించదు. ఆర్కిటిక్‌లో కనిపించే జంతువులు బంగాళాఖాతంలో కనిపించవు. ఈ విశాల ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు, అద్భుత దృశ్యాలు ఉన్నాయి.

Walking Fish: మంచు మీద నడిచే అతిపెద్ద చేప! వీడియో చూస్తే మీ కళ్లను మీరే నమ్మలేరు..
Walking Fish
Follow us

|

Updated on: Dec 20, 2022 | 5:51 PM

మనిషి కళ్లతో చూసి నమ్మలేని, చూడలేనివి ప్రకృతిలో అనేక విచిత్రలు దాగి ఉంటాయి. ఈ ప్రపంచంలో ఇప్పటికీ వేల సంఖ్యలో అంతుచిక్కని చిత్ర విచిత్రాలు దాగి ఉన్నాయి. భూమిపైనే కాదు, సముద్రం అడుగున, మంచు ప్రాంతాలలో కూడా అరుదైన జీవులు, వింతైన పరిస్థితులు కొన్నిసార్లు మనుషుల దృష్టిని ఆకర్షిస్తాయి. అలాంటప్పుడు వాటిని చూడటానికి రెండు కళ్లు చాలవు. అంటే అతిశయోక్తి కాదు. ఇక ప్రకృతి పరిశోధకుల విషయానికి వస్తే.. ఈ ప్రపంచంలో ఇప్పటికీ ఉనికిలో ఉన్న సృష్టిని కనుగొనడానికి వారు ప్రతి రోజు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. ఈక్రమంలోనే వారికి కనిపించిన ఓ అరుదైన దృశ్యాన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

పసిఫిక్ మహాసముద్రంలో కనిపించే జీవి అట్లాంటిక్ మహాసముద్రంలో కనిపించదు. ఆర్కిటిక్‌లో కనిపించే జంతువులు బంగాళాఖాతంలో కనిపించవు. ఈ విశాల ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు, అద్భుత దృశ్యాలు ఉన్నాయి. అలాంటి అద్భుతమైన జీవికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. అది నడిచే చేప. చేపలు నీటిలో మాత్రమే బతికే జీవులు. అవి భూమిపై జీవించలేవు అనేది సర్వ సాధారణం.

ఇవి కూడా చదవండి

కానీ భూమి మీద కూడా నడిచే చేప ఉంది. మంచు ప్రాంతంలో సముద్రం నుండి చేపలు మంచు మీద నడుస్తాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి లోనయ్యారు. పరిశోధకులు ఈ చేపను మొబైల్ చేపగా అభివర్ణించారు. చేపలు నిర్దిష్ట కాలం పాటు భూమిపై ఉండగలవని పరిశోధకులు తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి