Viral Video: పోలీస్ యూనిఫాంలో డ్యాన్స్ చేస్తున్న ఓ పోలీసు.. చర్యలు తీసుకోవాలంటున్న నెటిజన్లు

కుటుంబ సభ్యుడితో కలిసి డ్యాన్స్ చేస్తున్నప్పుడు చాలా మంది వ్యక్తులు చిత్రీకరిస్తున్నారు. అయితే ఇలా డ్యాన్స్ చేస్తున్న సమయంలో మరో   సీనియర్ పోలీసు అధికారి కరెన్సీ నోట్ల వర్షం కురిపించారు.

Viral Video: పోలీస్ యూనిఫాంలో డ్యాన్స్ చేస్తున్న ఓ పోలీసు.. చర్యలు తీసుకోవాలంటున్న నెటిజన్లు
Delhi Cop Dance
Follow us
Surya Kala

|

Updated on: Dec 20, 2022 | 5:36 PM

ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌లో పోలీస్ యూనిఫాంలో డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ నేప‌థ్యంలో ఢిల్లీ పోలీసు సిబ్బంది తీరుపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఈ పోలీసు తన కుటుంబ సభ్యులతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియోను చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసు అధికారి బంధువుల నిశ్చితార్థ వేడుకకు హాజరైనట్లు సమాచారం. అయితే ఇలా పోలీసు డ్రెస్ లో డ్యాన్స్ చేయడంతో అతను ప్రస్తుతం క్రమశిక్షణా చర్యలను ఎదుర్కొంటున్నాడు.

శ్రీ శ్రీనివాస్ నైరుతి ఢిల్లీలోని నారాయణ పోలీస్ స్టేషన్‌కు ఇన్‌ఛార్జ్‌గా విధులను నిర్వహిస్తున్న పోలీసు అధికారి గా తెలుస్తోంది.  వీడియోలో అతను హిట్ నంబర్ “బాలం తానేదార్” — అంటే “నా ప్రేమికుడు ఒక పోలీసు” సాంగ్ డ్యాన్స్ చేస్తున్నాడు. కుటుంబ సభ్యుడితో కలిసి డ్యాన్స్ చేస్తున్నప్పుడు చాలా మంది వ్యక్తులు చిత్రీకరిస్తున్నారు. అయితే ఇలా డ్యాన్స్ చేస్తున్న సమయంలో మరో   సీనియర్ పోలీసు అధికారి కరెన్సీ నోట్ల వర్షం కురిపించారు. సాంగ్ మధ్యలో  స్టైల్ గా సన్ గ్లాసెస్ కూడా పెట్టుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. డ్యూటీ డ్రెస్ లో డ్యాన్స్ చేస్తున్నందుకు ఆ పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పోలీసు అధికారి బంధువుల నిశ్చితార్థ వేడుకకు హాజరైనట్లు సమాచారం. “బలం తానెదరా” పాటకు డ్యాన్స్ చేస్తున్నాడు. ఈ వీడియోలో కనిపించిన మరికొందరు పోలీసులతో పాటు అతను ఆ రోజు సెలవులో ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..