AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

True Love: చితి మంటల సాక్షిగా.. అసలైన ప్రేమకు అర్థం ఇదేనంటున్న వృద్ధ దంపతులు..

ఈ క్రమంలోనే ఉదయం ఏడు గంటలకు భర్తకు టీ ఇచ్చింది. భార్యాభర్తలు కలిసి కూర్చుని మాట్లాడుకున్నారు. అంతా మామూలేగానే గడిచింది.

True Love: చితి మంటల సాక్షిగా.. అసలైన ప్రేమకు అర్థం ఇదేనంటున్న వృద్ధ దంపతులు..
Love Story
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 20, 2022 | 6:13 PM

వృద్ధ దంపతులకు సంబంధించి ఒక దిగ్భ్రాంతికరమైన కథనం వెలుగులోకి వచ్చింది. వృద్ధుడి మరణవార్త విన్న అతడి భార్య ఐదు నిమిషాల్లోనే తన ప్రాణాలను వదిలేసింది. దాంతో ఆ ఇద్దరూ పుణ్యదంపతులను ఒకే చితిపై దహనం చేశారు. ఈ అపూర్వ ప్రేమ కథ తెలిసిన స్థానికులు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఇలాంటి అరుదైన ప్రేమకథలు ప్రపంచంలో అప్పుడప్పుడు వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈనాటికీ ఇంతలా ప్రేమగా ఉండే భార్య భర్తలు కూడా ఉన్నారా…? అనే సందేహం అందరి మదిలో మెదిలింది. పూర్తి వివరాల్లోకి వెళితే…

హమీర్‌పూర్ జిల్లాలో వృద్ధుడైన భర్త మరణవార్త భార్యకు చెప్పడంతో ఆమె కూడా ప్రాణాలు విడిచింది. వివాహ సమయంలో ఏడు ప్రదక్షిణలు చేసి, ‘గోమతీ దేవి’ నిజమైన అర్థంలో కలిసి జీవించి చనిపోతానని ప్రమాణం చేసింది. భర్త మరణవార్త విన్న ఆమె కూడా ఐదు నిమిషాలకే ప్రాణాలు విడిచింది. బంధువులు ఒకే చితిపై ఇరువురి అంత్యక్రియలు నిర్వహించారు.

జిల్లాలోని రథ్ పట్టణంలోని పఠాన్‌పురా మొహల్లా గాయత్రీ నగర్‌కు చెందిన గాయప్రసాద్ సోని(72) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన భార్య గోమతి (68) భర్తకు సేవ చేసుకుంటుంది. ఈ క్రమంలోనే ఉదయం ఏడు గంటలకు భర్తకు టీ ఇచ్చింది. భార్యాభర్తలు కలిసి కూర్చుని మాట్లాడుకున్నారు. అంతా మామూలేగానే గడిచింది. మరో క్షణంలో ఇద్దరు చనిపోతారనే ఆలోచన ఎవరికీ లేదు.

ఇవి కూడా చదవండి

ఉదయం 7 గంటలకు స్ట్రోక్‌తో గయాప్రసాద్ తుదిశ్వాస విడిచారు. భర్త మృతి షాక్‌ తట్టుకోలేని గోమతి 5 నిమిషాలకే చనిపోయింది. సిహెచ్‌సి సమీపంలోని మోక్షధామ్‌లో ఒకే చితిపై ఇద్దరికీ అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు. అమర ప్రేమికులైన ఈ భార్య భర్తలను చూసిన బంధువులు, స్థానికులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వీళ్ల గురించి గంటల తరబడి చర్చించుకుంటున్నారు. గ్రామంలోనే కాదు, చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఈ వృద్ధ ప్రేమకథ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి