AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: వారిని ఎక్కువగా విసిగించారో.. దెయ్యాలుగా మారిపోతారు.. నవ్వులు పూయిస్తోన్న పైలెట్‌ స్వీట్‌ వార్నింగ్‌

ఒక విమాన ప్రయాణంలో పైలెట్ చేసిన స్వాగత ప్రసంగం ప్రయాణీకులందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. ఓవైపు జాగ్రత్తలు సూచిస్తూనే.. మరోవైపు రూల్స్‌ పాటించకపోతే ఏమవుతుందోనంటూ సుతిమెత్తగా భయపెడుతూ సాగిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంటోంది.

Watch Video: వారిని ఎక్కువగా విసిగించారో.. దెయ్యాలుగా మారిపోతారు.. నవ్వులు పూయిస్తోన్న పైలెట్‌ స్వీట్‌ వార్నింగ్‌
Spice Jet Flight
Basha Shek
|

Updated on: Dec 20, 2022 | 8:18 PM

Share

సాధారణంగా విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో అందులోని ప్రయాణికులకు పలు సూచనలిస్తారు ఫ్లైట్‌ సిబ్బంది. విమానం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుంది? ఎంత సమయం పడుతుంది? ఎంత ఎత్తులో విమానం ఎగురుతుంది? ప్రయాణికులు పాటించాల్సిన జాగ్రత్తలు, సిబ్బంది తదితర విషయాలపై ప్రయాణికులకు అవగాహన కల్పి్స్తారు. అందరికీ అర్థమయ్యే రీతిలో ఇంగ్లిష్‌ లేదా హిందీ భాషల్లో ఈ ప్రకటనలు ఉంటాయి. అయితే ఒక విమాన ప్రయాణంలో పైలెట్ చేసిన స్వాగత ప్రసంగం ప్రయాణీకులందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. ఓవైపు జాగ్రత్తలు సూచిస్తూనే.. మరోవైపు రూల్స్‌ పాటించకపోతే ఏమవుతుందోనంటూ సుతిమెత్తగా భయపెడుతూ సాగిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెటిజన్లను కూడా అమితంగా ఆకట్టుకుంటోంది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళుతోన్న ఓ స్పైస్‌ జెట్‌ ఫ్లైట్‌ గాల్లోకి టేకాఫ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ఎప్పటిలాగే ప్రయాణికులకు సూచనలు చెప్పడం ప్రారంభించాడు ఆ విమానం పైలెట్‌ కెప్టెన్‌ మోహిత్‌. అయితే అందరిలా కాకుండా కాస్తంత క్రియేటివిటీతో ఫన్‌ పుట్టించేలా తన స్పీచ్‌ కొనసాగించాడు.

దయ చేసి స్మోక్‌ చేయకండి..

‘ఇక్కడ నుంచి సుమారు గంటన్నర పాటు మన ప్రయాణం సాగుతుంది. కాబట్టి హాయిగా విశ్రాంతి తీసుకోండి. దయచేసి స్మోక్‌ చేయకండి.. కాదని పొగ తాగితే మాత్రం శిక్ష తప్పదు. ఇక మనం 36 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నాం. ఇంతకంటే ఎక్కువ ఎత్తుకు వెళితే బహుశా మీరు దేవుడిని చూడవచ్చు. ఈ విమానం గంటకు 800 కిలోమీటర్ల వేగంతో ఎగురుతుంది. బయట చాలా చల్లగా ఉంటుంది. ఉష్ణోగ్రత మైనస్ నలభై ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. వాతావరణం బాగాలేకపోతే కాసేపు విశ్రాంతి తీసుకోండి. అవసరమైతే ఎయిర్‌మెన్‌లను విసిగించండి. కాకపోతే ఏదైనా లిమిట్‌లోనే చేయండి. లేకపోతే వారు దెయ్యాలుగా మారే ప్రమాదం ఉంది. వాయుసేనలందరికీ ఇదే మా మనవి. నవ్వుతూ ఉండండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఫలహారాలు అందుబాటులో ఉన్నాయి. బోర్‌ రాకుండా ఉండేందుకు మీరు తోటి ప్రయాణికులతో మాట్లాడండి. ఇది మీ ప్రయాణాన్ని మరింత ఆహ్లాదంగా మారుస్తుంది. చివరగా ఓ మాట భూమి పైన ఆకాశం చాలా అందంగా ఉంటుంది. దానిని ఆస్వాదించండి.. బై’ అంటూ హిందీలో సాగిన అతని ప్రసంగం ప్రయాణికులందరినీ నవ్వుల్లో ముంచెత్తింది.

ఇవి కూడా చదవండి

వెంటనే రికార్డింగ్‌ మొదలెట్టాను..

ఈ మొత్తం సంఘటన విమానంలో ప్రయాణిస్తున్న ఎప్సితా అనే యువతి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. దీనిని స్పైస్ జెట్ సంస్థ తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ లో షేర్‌ చేసింది. దీనికి నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ‘ముందు ఇంగ్లిష్‌లో పైలట్ ప్రకటన వచ్చింది. తరువాత హిందీ ప్రకటన ప్రారంభం అయింది. మొదటి వాక్యమే నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించింది’ వెంటనే రికార్డింగ్ మొదలు పెట్టాను’ అని ఆమె తన ట్విట్టర్లో షేర్‌లో చేసింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..