Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Love Story: ఎల్లలు దాటిన ప్రేమ.. నైజీరియన్ అబ్బాయి చైన్నై సుందరి ప్రేమ నుంచి పెళ్లి వరకు ఆసక్తికరమైన కథ

తమిళనాడులోని చెన్నైకి చెందిన అమ్మాయి పేరు కల్ప . అబ్బాయి పేరు తోమిడే అకినియేమి. అతను లాగోస్ నుండి వచ్చాడు. 2015 లో వీరిద్దరూ అందాల పోటీల్లో పాల్గొన్నారు. అప్పుడే తొలిసారి కలుసుకున్నారు.

Love Story: ఎల్లలు దాటిన ప్రేమ.. నైజీరియన్ అబ్బాయి చైన్నై సుందరి ప్రేమ నుంచి పెళ్లి వరకు ఆసక్తికరమైన కథ
Indian Girl And Nigerian Boy Amazing Love Story
Follow us
Surya Kala

|

Updated on: Dec 20, 2022 | 8:32 PM

ప్రేమకు హద్దులు ఉండవని అంటారు. ప్రేమ కులం, మతం జాతి వంటి బేధాలను చూడదని అనేక సార్లు అనేక ప్రేమ పెళ్లిళ్లు రుజువు చేశారు. ప్రస్తుతం ఎక్కువగా వివిధ దేశాల్లో ఉంటున్న అబ్బాయిలు, అమ్మాయిలు ఒకరికొకరు ప్రేమించుకుని పెళ్లి కూడా చేసుకుంటున్నారు. ఇలాంటి ప్రేమకథలు, పెళ్లిళ్లు చూస్తూనే ఉన్నాం.. ప్రస్తుతం ఎల్లలు దాటిన ప్రేమకథ ఒకటి చాలా ఆసక్తికరంగా ఉంది. సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఒక భారతీయ అమ్మాయి నైజీరియాలో నివసిస్తున్న అబ్బాయితో ప్రేమలో పడింది. అనంతరం వారు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా తల్లి కాబోతోంది. అంటే ఆమె గర్భవతి.. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది.

మీడియా నివేదికల ప్రకారం.. ఈ భారతీయ-నైజీరియన్ జంట నైజీరియాలోని లాగోస్‌లో నివసిస్తున్నారు. వీరిద్దరూ మొదట అందాల పోటీలో కలుసుకున్నారు. తరువాత ఒకరినోకరు ఇష్టపడరు. డేటింగ్ ప్రారంభించారు. తర్వాత పెళ్లి కూడా చేసుకున్నాడు. ప్రస్తుతం, వైరల్ అవుతున్న ఈ జంట వీడియో.. అమ్మాయి గర్భవతి అని త్వరలో ఒక బిడ్డకు జన్మనివ్వబోతోందని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

అందాల పోటీ నుండి ప్రేమ ప్రయాణం 

తమిళనాడులోని చెన్నైకి చెందిన అమ్మాయి పేరు కల్ప . అబ్బాయి పేరు తోమిడే అకినియేమి. అతను లాగోస్ నుండి వచ్చాడు. 2015 లో వీరిద్దరూ అందాల పోటీల్లో పాల్గొన్నారు. అప్పుడే తొలిసారి కలుసుకున్నారు. అంతకు ముందు ఒకరికొకరు తెలియదు. విశేషమేమిటంటే..  ఈ పోటీలో ఒక అబ్బాయి.. ఒక అమ్మాయి జతగా పాల్గొనాల్సిన రౌండ్ ఉంది. అప్పుడు కల్ప, తోమిడే జంటగా మారి ఆ పోటీలోనూ విజయం సాధించారు. ఆ తర్వాతే ఇద్దరి మధ్య పరిచయం పెరిగి.. ప్రేమించుకున్నారు.

5 సంవత్సరాల వరకు డేటింగ్ నివేదికల ప్రకారం.. కల్ప- తోమిడ్ లు సుమారు 5 సంవత్సరాలు డేటింగ్ చేశారు. తరువాత వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 2021 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. కల్ప ప్రస్తుతం ప్రాజెక్ట్ మేనేజర్, మోడల్‌గా పనిచేస్తుంది. కల్ప  భర్త తోమిడే సృజనాత్మక, డిజిటల్ వ్యూహకర్తగా పని చేస్తున్నాడు. ఈ జంట త్వరలో ఓ బిడ్డకు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ దంపతులకు పలువురు అభినందనలు తెలుపుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..