Telangana – NGT: తెలంగాణకు షాక్ ఇచ్చిన ఎన్జీటీ.. భారీ జరిమానా.. ఆ విషయంలో ప్రమాణాలు పాటించడం లేదంటూ..
తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ షాక్ ఇచ్చింది. సుమారు రూ.900కోట్లు జరిమానా విధించింది. పాలమూరు రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తున్నారంటూ జాతీయ హరిత ట్రైబ్యునల్...
తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ షాక్ ఇచ్చింది. సుమారు రూ.900కోట్లు జరిమానా విధించింది. పాలమూరు రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తున్నారంటూ జాతీయ హరిత ట్రైబ్యునల్ చెన్నై బెంచ్ తెలంగాణకు భారీ ఫైన్ వేసింది. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 1.5 శాతం మేర చెల్లించాలని స్పష్టం చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణాలు చేపడుతున్నారని, వెంటనే పనులు ఆపి వేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ వెంకటయ్య అనే వ్యక్తి ఎన్జీటీలో పిటిషన్ వేశారు. అంతే కాకుండా ఈ విషయంలో ప్రభుత్వానికి గతంలో ఇచ్చిన ఆదేశాలనూ పాటించడం లేదని గుర్తు చేశారు. వెంకడటయ్య వేసిన పిటిషన్ పై కర్నూలుకు చెందిన చంద్రమౌలేశ్వర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై చెన్నై బెంచ్ విచారణ చేపట్టింది. పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మించిన పట్టిసీమ, పురుషోత్తపట్నం వ్యవహారంలో చేసినట్లుగానే పాలమూరు రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల విషయంలో తీసుకుంటున్నట్లు ఎన్జీటీ స్పష్టం చేసింది.
పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మించారంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన కేసులో రూ. 300 కోట్లు, పర్యావరణ నష్ట పరిహారం కింద పాలమూరు రంగారెడ్డిలో ప్రాజెక్టులో రూ. 528 కోట్లు… డిండి ప్రాజెక్టులో రూ. 92 కోట్లు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఎన్డీటీ ఆదేశించింది. నష్టపరిహారం చెల్లింపునకు 3 నెలల గడువు విధించింది. వ్యర్థాల నిర్వహణలో జారీ చేసిన ఆదేశాలు పాటించడం లేదంటూ .. గత అక్టోబర్ లో జాతీయ హరిత ట్రైబ్యునల్ తెలంగాణ ప్రభుత్వానికి రూ. 3,825 కోట్ల భారీ జరిమానా విధించిన విషయం తెలిసిందే.
ఈ అంశంలో ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడం లేదని ఈ సందర్భంగా బెంచ్ వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఆమోదయోగ్యం కాదంది. ఉల్లంఘనలు ఇలాగే కొనసాగితే అదనపు పరిహారం తప్పదని హెచ్చరించింది. కాగా.. తాజా తీర్పుతో తెలంగాణలో మల్లీ ఈ విషయం హాట్ టాపి క్ గా మారింది. అయితే ఎన్జీటీ వేసిన జరిమానాను వ్యతిరేకిస్తూ ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..