AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: బెంజ్ కారోడి బలుపు.. బైకర్స్‌పై పడ్డ నీళ్లు.. ఇదేంటని అడిగినందుకు గుద్ది చంపేశాడు..

కారుతో బైక్‌ను కావాలని ఢీకొట్టి మహిళ మృతికి కారణమైన నిందితుడ్ని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై 302 సెక్షన్ కింద కేసు ఫైల్ చేశారు.

Hyderabad: బెంజ్ కారోడి బలుపు.. బైకర్స్‌పై పడ్డ నీళ్లు.. ఇదేంటని అడిగినందుకు గుద్ది చంపేశాడు..
Benz Driver Hit Couple Bike
Ram Naramaneni
| Edited By: Rajeev Rayala|

Updated on: Dec 22, 2022 | 6:57 PM

Share

ర్యాష్‌ డ్రైవింగ్‌ చేశాడు నిందితుడు. ఏమని నిలదీస్తే వాగ్వాదానికి దిగాడు. కర్మ రా బాబు అని తిరిగి వెళ్తుండగా కారుతో యాక్సిడెంట్ చేశాడు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలు బుధవారం ప్రాణాలు కోల్పోయింది. ఈ నెల 19న తెల్లవారుజూమున ఎర్రగడ్డ నుంచి గచ్చిబౌలికి టూ వీలర్‌పై వెళ్తున్నారు ఓల్డ్ సిటీకి చెందిన సయ్యద్ సైఫుద్దీన్, అతని భార్య మరియా మీర్. మరో వెహికిల్‌పై వారి వెంటే వెళ్తున్నారు బంధువులైన మరో ఇద్దరు యువకులు. కేబుల్ బ్రిడ్జి దగ్గరకు రాగానే పక్క నుంచి బెంజ్ కారు దూసుకెళ్లింది. రోడ్డుపై నీరు వారి మీద పడటంతో కారులో ఉన్న రాజాసింహరెడ్డిని ప్రశ్నించారు యువకులు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపంతో ఊగిపోయిన రాజసింహ రెడ్డి వారిని ఫాలో అయ్యాడు. యువకులు వెళ్తున్న బైక్‌ను ఢీ కొట్టాడు. షాక్‌కు గురైన సైఫుద్దీన్ రాజసింహరెడ్డిని నిలదీశాడు. దీంతో అతన్ని కూడా కారుతో డీ కొట్టడంతో బైక్‌పై ఉన్న దంపతులు ఎగిరి కిందపడ్డారు.

మరియాకు తీవ్ర గాయాలు కావడంతో AIG ఆస్పత్రికి తరలించారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది. బాధితుల ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. కారు స్వాధీనం చేసుకొని రాజసింహ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై 302 సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

ఒక చిన్న సారీతో పోయేదానికి ఒక ప్రాణం బలైందని.. మృతురాలి 8 నెలల కుమార్తె అమ్మ ప్రేమకు దూరమైందని..  అంతేకాదు శిక్ష పడ్డాక 26 ఏళ్లు వయస్సు ఉన్న నిందితుడు రాజసింహరెడ్డి ఫ్యూచర్ మొత్తం నాశనం అవుతుందని.. ఇలాంటి పరిస్థితుల్లో కాస్త ఆలోచనతో మెలగాలని పోలీసులు సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..