Telangana: బీఆర్ఎస్-బీజేపీ మధ్య మరో వివాదం.. కేంద్రమంత్రి ట్వీట్.. నిరూపించాలంటూ రాష్ట్ర మంత్రి సవాల్..
కేంద్రం వర్సెస్ రాష్ట్రం.. మరో వివాదానికి బీజం పడింది. అది క్రమంగా రాజుకుంటోంది? విమర్శల స్టేజ్ దాటిపోయి.. సవాళ్ల వరకూ వచ్చింది మ్యాటర్. ఎంతకీ ఏంటా పంచాయితీ? వివరాల్లోకెళితే..
కేంద్రం వర్సెస్ రాష్ట్రం.. మరో వివాదానికి బీజం పడింది. అది క్రమంగా రాజుకుంటోంది? విమర్శల స్టేజ్ దాటిపోయి.. సవాళ్ల వరకూ వచ్చింది మ్యాటర్. ఎంతకీ ఏంటా పంచాయితీ? వివరాల్లోకెళితే.. రైతులు, వ్యవసాయం అంశాల్లో ఇప్పటికే కేంద్రం, రాష్ట్రం మధ్య చాలా వివాదాలు ఉన్నాయి. మద్దతు ధర, ఉచిత విద్యుత్, మోటర్లకు మీటర్లు, ధాన్యం కొనుగోళ్లు ఇలా అనేక అంశాలపై పంచాయితీ నడిచింది. ధాన్యం కొనుగోళ్లపై అయితే మినీయుద్ధమే సాగింది. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి మరో వివాదం చేరింది. పామాయిల్ పంట.. కేంద్రం సబ్సిడీపై రెండు పార్టీల మధ్య మొదలైన విమర్శలు కాస్తా.. సవాళ్ల వరకూ వెళ్లింది.
పామాయిల్ సాగను అటు కేంద్రం, ఇటు రాష్ట్రమూ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాయి. తెలంగాణలో ఈ సీజన్‌లో 46 వేల ఎకరాల్లో ఈ పంటను సాగుచేస్తున్నారు. అటు సిద్ధిపేటలోనూ 300 కోట్లతో ఆయిల్‌పామ్ పరిశ్రమను నిర్మిస్తున్నట్లు ప్రకటించారు మంత్రి హరీష్‌రావు. ఈ స్టేట్‌మెంట్‌నే ట్యాగ్ చేస్తూ.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఓ ట్వీట్ చేశారు. దేశంలో పామాయిల్ సాగుకు అనుకూలమైన నేలలో 15% తెలంగాణలోనే ఉందని చెప్పారు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ – ఆయిల్ పామ్ కార్యక్రమంతో తెలంగాణ రైతులకు చాలా లాభం జరుగుతుందని చెప్పారు. అంటే ఈ పథకం మొత్తం అంచనా వ్యయం 11,040 కోట్లు కాగా, అందులో కేంద్రమే 8,844 కోట్లను అందిస్తోందని తెలిపారు.
కిషన్‌రెడ్డి చేసిన ఈ ప్రకటనకే కౌంటర్ ఇచ్చారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి. పామాయిల్ పంట సాగు కోసం ఇంత వరకు కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదన్నారు. ఒక వేళ వస్తే రేపు ఉదయంలోగా ఆధారాలు చూపాలంటూ సవాల్ విసిరారు. మరి బీఆర్ఎస్ సవాల్‌కు కేంద్రం రియాక్ట్ అవుతుందా? నిధులకు సంబంధించిన వివరాలు విడుదల చేస్తుందా?పామాయిల్ పంచాయితీలో నెక్స్ట్ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..