Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

High BP: హై బీపీ ఉన్నవారు ఈ 4 ఆహారాలకు దూరంగా ఉండాలి.. తిన్న వెంటనే రక్తపోటు పెరుగుతుంది..

ప్రస్తుత కాలంలో ప్రజల జీవనశైలిలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. తగినంత శారీరక వ్యాయామం చేయకపోవడం వల్ల అనేక వ్యాధుల బాధితులుగా మారుతున్నారు. ఆ వ్యాధులలో అధిక రక్తపోటు ఒకటి.

High BP: హై బీపీ ఉన్నవారు ఈ 4 ఆహారాలకు దూరంగా ఉండాలి.. తిన్న వెంటనే రక్తపోటు పెరుగుతుంది..
చాలా మందికి తరచుగా టీ తాగే అలవాటు ఉంటుంది. అయితే, హై బీపీ ఉన్నవారు టీ తాగడం మానేయాలి. ఎందుకంటే ఇది తీసుకోవడం వల్ల మీ బీపీ పెరుగుతుంది.
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 22, 2022 | 6:07 AM

ప్రస్తుత కాలంలో ప్రజల జీవనశైలిలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. తగినంత శారీరక వ్యాయామం చేయకపోవడం వల్ల అనేక వ్యాధుల బాధితులుగా మారుతున్నారు. ఆ వ్యాధులలో అధిక రక్తపోటు ఒకటి. ఈ వ్యాధి ఒక్కటే కాదు దానితో పాటు మరో 5 సమస్యలను కూడా తెస్తుంది. దీని కారణంగా రక్తపోటు, గుండెపోటు, మధుమేహం, షుగర్ పేషెంట్స్ గా కూడా మారొచ్చు. అందుకే రక్తపోటు సమస్యను తగ్గించడం చాలా అవసరం. కాగా, హైబీపీ ఉన్నవారు పొరపాటున కూడా తినకూడని 5 పదార్థాల గురించి ఇవాళ మనం తెలుసుకుందాం..

అధిక రక్తపోటు ఉన్నవారు ఏం తినకూడదు..

ప్యాక్ చేసిన, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినవద్దు..

అన్నింటిలో మొదటిది.. ప్యాక్ చేసిన, ప్రాసెస్ చేసిన ఆహారానికి పూర్తిగా దూరంగా ఉండాలి. వైద్యుల ప్రకారం.. ప్యాక్ చేసిన ఆహారాలు చాలా కాలం క్రితం తయారు చేసి ఉంటాయి. ఈ ఆహారాన్ని తాజాగా ఉంచడానికి అనేక రకాల మసాలాలు కలుపుతారు. ఇది ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. అందుకే వీలైనంత త్వరగా ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది.

వేయించిన ఆహారాలు తినడం మానుకోండి..

ఎక్కువ ఉప్పు, సుగంధ ద్రవ్యాలు, వేయించిన ఆహారాలను అస్సలు తీసుకోవద్దు. వాటి వినియోగానికి దూరంగా ఉండాలి. వీటిలో అధిక మొత్తంలో సోడియం ఉంటుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. సోడియం కారణంగా, రక్త సరఫరా సిరల పనితీరు తగ్గిపోవటం ప్రారంభమవుతుంది. దీని కారణంగా రక్తపోటు పెరుగుతుంది. ఈ సమస్యను నివారించడానికి.. సాధారణ, ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని తినండి.

ఉప్పు పదార్థాలు..

ఊరగాయ కూడా అలాంటిదే. ఇది హై బీపీకి ప్రధాన కారణం అవుతుంది. ఇందులో ఉప్పు, నూనె ఎక్కువగా ఉంచి ఊరగాయను ఆరబెట్టడం వల్ల రక్తపోటు ఆటోమేటిక్‌గా అధికమవుతుంది. కనీసం ఊరగాయ అయినా తింటే బాగుంటుంది. మీకు తినాలని అనిపిస్తే ఇంట్లో తయారుచేసిన పొడి ఊరగాయ తినొచ్చు. దీంతో పెద్దగా ప్రమాదం ఉండదంటున్నారు నిపుణులు.

టీ, కాఫీలతో బీపీ పెరుగుతుంది..

కాఫీలో కెఫీన్ అనే మూలకం ఉంటుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. బీపీ తక్కువగా ఉన్నవారు టీ, కాఫీలు తాగడం మంచిది. ఇలా చేయడం వల్ల వారిలో రక్తపోటు మరంత పెరుగుతుంది. అయితే బీపీ నార్మల్‌గా లేదా ఎక్కువగా ఉన్నవారు ఈ రెండింటికి పూర్తిగా దూరంగా ఉండాలి. వీటిని తాగడం వల్ల రక్తపోటు పెరుగుతుంది.

(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం, ఇంటి నివారణలు ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.)

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..