CM KCR: కేంద్రంపై మళ్లీ యుద్ధం ప్రకటించిన బీఆర్ఎస్.. శుక్రవారం అన్ని జిల్లా కేంద్రాల్లో రైతులతో కలిసి మహాధర్నాలు

కేంద్రంపై మళ్లీ యుద్ధం ప్రకటించింది BRS. రైతు వ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ రేపు తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో మహాధర్నాలకు పిలుపునిచ్చింది. ఇంతకీ BRS డిమాండ్లు ఏంటి? దానికి BJP ఇస్తున్న కౌంటర్లు ఏంటో చూద్దాం..!

CM KCR: కేంద్రంపై మళ్లీ యుద్ధం ప్రకటించిన బీఆర్ఎస్.. శుక్రవారం అన్ని జిల్లా కేంద్రాల్లో రైతులతో కలిసి మహాధర్నాలు
CM KCR
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 22, 2022 | 8:23 PM

పంట కల్లాలు కల్లోలం రేపుతున్నాయి. పొలిటికల్‌గానూ తీవ్ర దుమారం రేగుతోంది.! మరోసారి వివాదం కేంద్రం వర్సెస్ తెలంగాణ రాష్ట్రంగా మారిపోయింది. ఉపాధిహామీ పథకం కింద రాష్రవ్యాప్తంగా కల్లాలు నిర్మిస్తోంది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పటికే 150 కోట్లు ఖర్చు చేసింది. అయితే ఉపాధి నిధులతో కల్లాలు నిర్మించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన కేంద్రం.. ఖర్చు చేసిన ఆ 150 కోట్లను తిరిగి చెల్లించాలని హుకూం జారీ చేసిందన్నది బీఆర్ఎస్ వర్షన్.. ధాన్యాన్ని ఆరబోయడం కోసం..సరైన వసతులు లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. చాలాచోట్ల రోడ్లపైనే వడ్లు కుప్పులుగా పోస్తున్నారు. ఈ సమస్యను తీర్చడం కోసమే కల్లాలు నిర్మిస్తోంది ప్రభుత్వం..!

దేశంలో ఎక్కడా లేని విధంగా అన్నదాతలకు మేలు చేస్తుంటే.. ఉపాధి హామీ నిధుల్ని దారి మళ్లిస్తున్నారంటూ కేంద్రం తప్పుడు ప్రచారం చేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే బీజేపీ వర్షన్ మాత్రం మరోలా ఉంది. కేసీఆర్ కుటుంబ సభ్యుల మీద వస్తున్న అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఈ ధర్నాలు, డ్రామాలని ఆరోపిస్తోంది. టీఆర్ఎస్-బీఆర్ఎస్‌గా మారిన తర్వాత చేపడుతున్న తొలి ధర్నా కావడంతో పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రైతుల భాగస్వామ్యంతో ధర్నాను విజయవంతం చేసే బాధ్యతను తీసుకున్నారు మంత్రులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం