Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Veena-Vani: తొలిసారి సొంతూరుకు అవిభక్త కవలలు వీణ-వాణిలు.. భావోద్వేగ దృశ్యాలు

అవిభక్త కవలలు వీణ-వాణిలు వారి సొంతూరికి వచ్చారు. 19 ఏళ్ల తర్వాత రావడంతో వారిని చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున వచ్చారు.

Veena-Vani: తొలిసారి సొంతూరుకు అవిభక్త కవలలు వీణ-వాణిలు.. భావోద్వేగ దృశ్యాలు
Veena- Vani
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 22, 2022 | 5:43 PM

అవిభక్త కవలలు వీణ-వాణి మొదటిసారి తాము పుట్టిన గ్రామానికి వెళ్లారు. మహబూబాబాద్ జిల్లాలోని దంతాలపల్లి మండలంలోని తమ స్వగ్రామం బీరిశెట్టిగూడెంకు వెళ్లిన వీణా -వాణిలను చూసేందుకు భారీగా తరలి వచ్చారు గ్రామస్తులు. పుట్టిన తర్వాత మొదటిసారి వీణ-వాణిలను స్టేట్ హోం అధికారులు వారు పుట్టిన ఊరికి తీసుకెళ్లారు. దాంతో వీణ-వాణి తల్లిదండ్రులు భావోద్వేగానికి లోనయ్యారు. 19 సంవత్సరాల తరవాత పుట్టిన ఊరికి రావడంతో.. పిల్లలను చూసి వారు కంటతడి పెట్టుకున్నారు.  చాలా సంవత్సరాలు తర్వాత మా ఇంటికి రావడం ఆనందంగా ఉందని అవిభక్త కవలలు వీణ-వాణి తెలిపారు.

2003 సంవత్సరంలో మురళి, నాగలక్ష్మి దంపతులకు తలలు అతుక్కుని కవలలుగా పుట్టారు వీణ-వాణి. అప్పుడే చికిత్స కోసం హైదరాబాద్ తీసుకువచ్చారు. వీణ వాణీలను విడదీయాలని ఎంతగానో ప్రయత్నించినా వైద్యులు సఫలం కాలేదు.  వీరిద్దరిని శస్త్రచికిత్స ద్వారా విడదీస్తే వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశముందని వైద్య నిపుణులు తేల్చడంతో ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు.

అప్పటి నుంచి ఈ కవలలు 12 ఏళ్ల వరకు నీలోఫర్ ఆసుపత్రిలోనే ఉన్నారు. 12ఏళ్ల వయసు దాటిన తర్వాత గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కవలలను స్టేట్‌ హోమ్‌కు తరలించారు. ఇటీవలే ఈ కవలలు ఇంటర్మీటియట్‌ ఫస్ట్‌క్లాస్‌లో పాసై తమ ప్రతిభను చాటుకున్నారు. భవిష్యత్తులో చార్టెడ్ అకౌంటెంట్స్‌ అవుతామని గర్వంగా చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..