AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sabitha Indra Reddy: హైటెక్ సిటీ ఒక్కటి కడితే.. హైదరాబాద్ అభివృద్ధి అయినట్టా.. చంద్రబాబుపై తెలంగాణ మంత్రి ఫైర్..

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఖమ్మం మీటింగ్ లో చేసిన కామెంట్స్ పై తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. హైటెక్ సిటీ ఒక్కటి కట్టినంత మాత్రాన అభివృద్ధి అంతా చంద్రబాబు చేశారా...

Sabitha Indra Reddy: హైటెక్ సిటీ ఒక్కటి కడితే.. హైదరాబాద్ అభివృద్ధి అయినట్టా.. చంద్రబాబుపై తెలంగాణ మంత్రి ఫైర్..
Sabitha Indra Reddy
Ganesh Mudavath
|

Updated on: Dec 22, 2022 | 5:51 PM

Share

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఖమ్మం మీటింగ్ లో చేసిన కామెంట్స్ పై తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. హైటెక్ సిటీ ఒక్కటి కట్టినంత మాత్రాన అభివృద్ధి అంతా చంద్రబాబు చేశారా అని ప్రశ్నించారు. తెలంగాణలో అందరూ ప్రశాంతంగా ఉన్నారని, పరిస్థితులు శాంతియుతంగా ఉన్నాయని చెప్పారు. ప్రధాని మోదీ డైరెక్షన్ లోనే చంద్రబాబు తెలంగాణకు వస్తున్నారన్న ఆమె.. కరోనా సమయంలో హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు ఒక్క గల్లీలో అయినా తిరిగారా అని నిలదీశారు. బండి సంజయ్ చెబితే ఈడీ, సీబీఐ వస్తాయని, బీజేపీ డైరెక్షన్ వల్లే దాడులు జరుగుతున్నాయని మంత్రి సబితా ఆరోపించారు. కొవిడ్ పై కేంద్రం ఇచ్చిన గైడెన్స్ మీద హెల్త్ రివ్యూ అనంతరం ఆదేశాలు ఉంటాయని చెప్పారు. సరూర్ నగర్ విద్యార్థుల సమస్యల పై త్వరలోనే పరిష్కారం చూపిస్తామని స్పష్టం చేశారు.

మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు అవుతోంది. రైతుల పట్ల కేంద్రం ఏ విధంగా వ్యవహరిస్తుందో చూస్తున్నాం. రైతుకు మేలు చేయాలనే ఆలోచన కేసీఆర్ ది. రైతులను, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోంది. తెలంగాణపై కక్ష కట్టి వరి కొనకుండా వివక్ష చూపారు. ఉపాధి హామీ నిధులు దారి మళ్లిస్తున్నామని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు కళ్లాలు కడితే కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన నష్టమేంటి. రోడ్డెక్కి ధర్నాలు చేస్తే తప్ప మోడీకి వినిపించనట్లు ఉంది. అందుకే రేపు ( శుక్రవారం ) అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నాం.

– సబితా ఇంద్రారెడ్డి, తెలంగాణ మంత్రి

ఇవి కూడా చదవండి

కాగా.. తెలంగాణలో ఓటు అడిగే హక్కు తెలుగుదేశం పార్టీకే ఉందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు. తాను ఫౌండేషన్‌ వేయకపోతే హైదరాబాద్‌ ఇంత అభివృద్ధి అయ్యేదా అని ప్రశ్నించారు. తెలంగాణలోనూ టీడీపీ బలంగా ఉండాల్సిన అవసరముందని ఆయన పిలుపునిచ్చారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మళ్లీ భవిష్యత్ లో కలిసే అవకాశమే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అధికార పార్టీకి చెందిన నేతల మాటల ఎదురు దాడులతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ నెలకొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్