Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Temjen Imna Along: మళ్ళీ ఒక్క ఫొటోతో మనసు దోచేసిన మంత్రి ఇమ్నా అలాంగ్.. మీ వల్లే మేము నాగా ప్రజల ప్రేమలో పడ్డామంటోన్న నెటిజనం

ప్రస్తుతం.. మంత్రి ఇమ్నా అలోంగ్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్ ఫామ్ ల్లో చర్చనీయాంశంగా మారింది. ఇందులో మంత్రి తన హాస్యంతో మరోసారి నెటిజన్ల హృదయాలను గెలుచుకున్నారు.

Temjen Imna Along: మళ్ళీ ఒక్క ఫొటోతో మనసు దోచేసిన మంత్రి ఇమ్నా అలాంగ్.. మీ వల్లే మేము నాగా ప్రజల ప్రేమలో పడ్డామంటోన్న నెటిజనం
Temjen Imna Along
Follow us
Surya Kala

|

Updated on: Dec 22, 2022 | 7:26 PM

నాగాలాండ్‌ ఉన్నత విద్య, గిరిజన వ్యవహారాల మంత్రి టెమ్‌జెన్ ఇమ్నా అలాంగ్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతూ ఉంటారు. తన పదునైన మాటలతో.. సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో నెటిజన్లను ఆకట్టుకున్నారు.. అత్యంత ఇష్టమైన వ్యక్తిగా కూడా మారారు. అంతేకాదు మంత్రి ఇమ్నా అలాంగ్ సోషల్ మీడియాలో కొత్త పోస్ట్‌ను షేర్ చేసిన వెంటనే అది వైరల్ అవుతుంది. ప్రస్తుతం.. మంత్రి ఇమ్నా అలోంగ్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్ ఫామ్ ల్లో చర్చనీయాంశంగా మారింది. ఇందులో మంత్రి తన హాస్యంతో మరోసారి నెటిజన్ల హృదయాలను గెలుచుకున్నారు.

బుధవారం..  41 ఏళ్ల మంత్రి ఇమ్నా అలోంగ్ తన ట్విట్టర్ హ్యాండిల్ లో తన చిత్రాన్ని షేర్ చేశారు. అందులో మంత్రి ఒక వంటకాన్ని ఆస్వాదిస్తున్నట్లు కనిపిస్తున్నారు. అంతేకాదు ‘నియంత్రిత వాతావరణంలో ఒక ప్రొఫెషనల్ చేసిన స్టంట్. దాన్ని కాపీ కొట్టవద్దనే క్యాప్షన్ కూడా ఇచ్చారు పోస్ట్ కి. ఈ పోస్ట్‌పై మంత్రి గారి ఫ్యాన్స్ తమ ప్రేమను విపరీతంగా కురిపించడం ప్రారంభించారు. ప్ర‌జ‌ల రియాక్ష‌న్‌ల‌కి వెళ్లేముందు వైర‌ల్‌గా మారిన నాగాలాండ్ మంత్రి ట్వీట్ చూద్దాం.

ఇవి కూడా చదవండి

టెమ్‌జెన్ ఇమ్నా అలోంగ్ ట్వీట్

టెమ్‌జెన్ ఇమ్నా అలోంగ్ చేసిన ఈ పోస్ట్‌కి ఇప్పటివరకు 22.3 వేలకు పైగా లైక్‌లు మరియు 967 రీట్వీట్‌లు వచ్చాయి. ఒకరు .. లక్ష్యం చిన్నదైనా లేదా పెద్దదైనా..  మీరు ఎల్లప్పుడూ దానిపై దృష్టి కేంద్రీకరించినట్లు కనిపిస్తారు. అదే సమయంలో.. మరొక వినియోగదారు  మీ హాస్య చతురత సమాధానం లేదు. మీరు మాకు రత్నం వంటివారు అని మరొకరు కామెంట్ చేయగా.. మీ వల్లే నేను నాగా ప్రజలతో, సంస్కృతితో ప్రేమలో పడ్డానని మరొక వినియోగదారు కామెంట్ చేశారు..

చిన్న కళ్ళ ప్రయోజనాలు.. కొన్ని నెలల క్రితం వరకూ మంత్రి ఇమ్నా అలోంగ్ చాలా తక్కువ మందికి తెలుసు.. తన ‘చిన్న కళ్ల ప్రయోజనాలను’ వివరిస్తూ ఒక ప్రకటన చేసినప్పటి నుండి.. మంత్రి  దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఇమ్నా అలోంగ్ మాట్లాడుతూ, ఈశాన్య ప్రజలు చిన్న కళ్ళు కలిగి ఉండటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సుదీర్ఘమైన ప్రోగ్రామ్‌లో మీరు వేదికపై కూర్చొని నిద్రపోయినా, ఎవరికీ తెలియదు. దీనితో పాటు మన కంటి చూపు కూడా పదునుగా ఉంటుందని చెప్పి.. నెటిజన్లను ఆకట్టుకున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..