Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: పుల్లారెడ్డి కుటుంబంపై మరోసారి గృహహింస ఆరోపణలు.. రాష్ట్రపతికి లేఖ రాసిన ఏక్‌నాథ్ రెడ్డి భార్య..

ప్రముఖ పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత జీ పుల్లారెడ్డి మనుమడు, వారసుడు ఏక్నాథ్ రెడ్డి తన భార్యను వరకట్న వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలను ఎవరో చేస్తే..

Hyderabad: పుల్లారెడ్డి కుటుంబంపై మరోసారి గృహహింస ఆరోపణలు.. రాష్ట్రపతికి లేఖ రాసిన ఏక్‌నాథ్ రెడ్డి భార్య..
Eknath Reddy And Pragnya Reddy
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 26, 2022 | 5:06 PM

ప్రముఖ పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత జీ పుల్లారెడ్డి మనుమడు, వారసుడు ఏక్నాథ్ రెడ్డి తన భార్యను వరకట్న వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలను ఎవరో చేస్తే కొట్టిపడేయవచ్చు. కానీ ఏక్నాథ్ భార్య ప్రజ్ఞారెడ్డి స్వయంగా చేశారు. అంతేకాదు.. ఆమె ఏకంగా దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ(మెయిల్) కూడా చేశారు. పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని, తన మామ జి.రాఘవరెడ్డి, ఆయన భార్య భారతి రెడ్డి, వారి కూతురు శ్రీవిద్యారెడ్డిల నుంచి తనను కాపాడాలంటూ ప్రజ్ఞారెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. ఈ నెల 29న తన కుటుంబానికి చెందిన జీ నారాయణమ్మ కాలేజీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. నేటి నుంచి తెలంగాణ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ఈ నెల 30 వరకు హైదరాబాద్ సహా అనేక ప్రాంతాలలో జరిగే పలు కార్యక్రమాలలో పాల్గొనున్నారు. ఈ క్రమంలో ప్రజ్ఞారెడ్డి  రాసిన లేఖ ప్రకంపనలు సృష్టిస్తోంది. వేళ రాఘవరెడ్డి, భారతిరెడ్డి, శ్రీవిద్యారెడ్డి  గత రెండేళ్లుగా తనను, తన ఎనిమిదేళ్ల కూతురిని తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని ప్రజ్ఞారెడ్డి ఆరోపించారు.

అయితే వారు గతంలో కూడా తనను వరకట్నం కోసం హింసించారని, తనను గదిలోంచి బయటికి రానివ్వకుండా రాత్రికి రాత్రే గోడ కట్టేశారని వివరించారు. కోర్టు స్పందించి, ఆ గోడ కూల్చేయాలని చెప్పిందని ప్రజ్ఞారెడ్డి వివరించారు. అంతేకాక తన అత్తింటివారు తనను, తన కూతురును చంపేందుకు కూడా ప్రయత్నించారని తన లేఖలో ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తన అత్త భారతిరెడ్డిపై హైదరాబాదులో భూకబ్జా కేసులు కూడా ఉన్నాయని ఆమె వెల్లడించారు. ‘‘దేశ ప్రథమ పౌరురాలిగా, ఓ మహిళగా సాటి మహిళ వేదనను అర్థం చేసుకుంటారన్న ఆలోచనతో మీకు ఈ లేఖ రాస్తున్నాను. నాకు, నా బిడ్డకు న్యాయం చేయండి’’ అంటూ ప్రజ్ఞారెడ్డి తాను రాసిన లేఖలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విజ్ఞప్తి చేశారు.

కాగా, పుల్లారెడ్డి స్వీట్స్ వ్యవస్థాపకుడు జి.పుల్లారెడ్డి వారసుడిగా పుల్లారెడ్డి గ్రూప్ వ్యవహారాలను ఆయన కుమారుడు జి.రాఘవరెడ్డి చూసుకుంటున్నారు. ఆయన కుమారుడు ఏక్ నాథ్ రెడ్డికి 2014లో ప్రజ్ఞారెడ్డితో వివాహం జరిగింది. ప్రజ్ఞారెడ్డి తండ్రి కేఆర్ఎం రెడ్డి మైనింగ్ వ్యాపారంలో ఉన్నారు. పెళ్లి తర్వాత కొంతకాలానికే ఏక్ నాథ్ రెడ్డి, ప్రజ్ఞారెడ్డిల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. భర్త, అత్తమామలు వేధింపులకు గురిచేస్తున్నాంటూ ప్రజ్ఞారెడ్డి గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో పుల్లారెడ్డి కుటుంబ సభ్యులపై పంజాగుట్ట పీఎస్‌లో గృహహింస చట్టం కింద కేసు కూడా నమోదైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..