Skincare Tips: పొడిబారిన చర్మంతో ఇబ్బందిపడుతున్నారా..? అయితే మీ కోసం నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి..
Skincare Tips in Winter: చలికాలంలో కెరటోసిస్ పిలారిస్ అనే చర్మవ్యాధులు ఎక్కువగా వస్తాయని చర్మవ్యాధి నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా చర్మంపై మచ్చలు, నల్ల మచ్చలు ఏర్పరుడతాయని, చేతుల మీద..
Skincare Tips in Winter:చలికాలం ప్రారంభమవడంతోనే అనేక రకాల ఆరోగ్య సమస్యలు మనల్ని వెంటాడడం మొదలవుతుంది. ఈ క్రమంలోనే చర్మం సమస్యలు కూడా ప్రారంభమవుతాయి. చర్మం పొడిబారడం, చర్మంపై దద్దుర్లు రావడం, జిడ్డు చర్మం ఇలా అనేక ఇబ్బందులు. చలికాలంలో చర్మం మెరుపు కోల్పోయి చర్మం పొడిబారుతుంది. దీనిని చికెన్ స్కిన్ లేదా స్ట్రాబెర్రీ స్కిన్ అని కూడా అంటారు. డ్రై స్కిన్ అనేది తరచుగా వాక్స్, షేవ్ చేసే స్త్రీలలో కనిపించే ఒక సాధారణ చర్మ సమస్య. అయితే ఈ సమస్య మన చర్మానికి అంత మంచిది కాదు. అందుకోసం మనం తగు జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే చర్మం పొడిబారిపోతుంది. దాని కారణంగా మనం నలుగురితో కలవడానికి కూడా ఇష్టపడం. అంతే కాక మనలోని ఆత్మవిశ్వాసం కూడా సన్నగిల్లుతుంది.
అయితే చలికాలంలో కెరటోసిస్ పిలారిస్ అనే చర్మవ్యాధులు ఎక్కువగా వస్తాయని చర్మవ్యాధి నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా చర్మంపై మచ్చలు, నల్ల మచ్చలు ఏర్పరుడతాయని, చేతుల మీద, తొడల వెనుక భాగంలో పొడిబారినట్లుగా కనిపిస్తుందని వారు అంటున్నారు. అందుకోసం చర్మాన్ని సంరక్షించుకోవాలని వారు సూచిస్తున్నారు. వారు మనకు తెలిపిన సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం..
శీతాకాలంలో పొడి చర్మానికి పరిష్కారాలు..
- ఉదయాన్నే లేచి గోరువెచ్చని నీటితో స్నానం చేయండి.
- స్నానం చేసేందుకు తేలికపాటి నురుగు వచ్చే కఠినమైన సబ్బుల వాడకాన్ని తగ్గించాలి.
- స్కిన్ క్రీమ్‌లు వాడుతున్నప్పుడు యూరియా, లాక్టిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్ ఉన్న కెరాటోలిక్‌ను వాడండి. చర్మాన్ని మృదువుగా చేయడానికి ఈ ఉత్పత్తులను మాయిశ్చరైజర్‌లతో పాటు ఉపయోగించవచ్చు.
- చర్మాన్ని తీవ్రతరం చేసే సింథటిక్ దుస్తులను ఉపయోగించవద్దు.
- స్నానం చేసేటప్పుడు స్క్రబ్బింగ్ లేదా లూఫాస్ ఉపయోగించడం మానుకోండి. ఎందుకంటే ఇది షేవింగ్ లేదా వ్యాక్సింగ్ లాంటిది.
- చర్మాన్ని తేమగా ఉంచడానికి మాయిశ్చరైజర్లను ఉపయోగించండి.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం