Hyderabad: భాగ్యనగర వాసులకు కరోనా అలెర్ట్.. వేగంగా విజృంభిస్తొన్న కోవిడ్.. ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..

ప్రపంచ దేశాలపై కరోనా విజృంభిస్తొన్న వేళ తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోనూ కేసులు వేగవంతంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో గత వారం రోజులలో నమోదైన వాటికి నాలుగు రెట్ల కేసులను..

Hyderabad: భాగ్యనగర వాసులకు కరోనా అలెర్ట్.. వేగంగా విజృంభిస్తొన్న కోవిడ్.. ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..
Covid19 Cases Increasing In Hyderabad
Follow us

|

Updated on: Dec 27, 2022 | 2:57 PM

ప్రపంచ దేశాలపై కరోనా విజృంభిస్తొన్న వేళ తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోనూ కేసులు వేగవంతంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో గత వారం రోజులలో నమోదైన వాటికి నాలుగు రెట్ల కేసులను అధికారులు నిన్న(డిసెంబర్ 26) ఒక్క రోజే గుర్తించారు. క్రమక్రమంగా పెరుగుతున్న కేసులు నిన్న వేగవంతం అయేసరికి హైదరాబాద్ ప్రజలు కరోనా భయంతో ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో కరోనా స్థితిపై అధికారిక ప్రకటన ప్రకారం డిసెంబర్ 20న మూడు కేసులను గుర్తించగా, డిసెంబర్ 26న 12 కేసులు నమోదయ్యాయి. అయితే ఇక్కడ ఆనందించదగిన విషయమేమంటే హైదరాబాద్ మినహా తెలంగాణలోని ఇతర జిల్లాల్లో కోవిడ్ కేసులు పెరగడం లేదు. దాదాపు అన్నిజిల్లాలలో ఒక్క కేసు కూడా నమోదవలేదు.

తెలంగాణలో డిసెంబర్ 25న 12 కేసులు నమోదు కాగా, అవన్నీ హైదరాబాద్‌లో గుర్తించినవే. గడిచిన ఏడు రోజుల్లో హైదరాబాద్‌లో 45 కోవిడ్ కేసులను గుర్తించారు. వాటిల్లో ఆదిలాబాద్‌లో 7, మేడ్చల్ మల్కాజిగిరిలో 6, నిజామాబాద్‌లో 2, కరీంనగర్‌లో 2, ఖమ్మంలో 1, కామారెడ్డిలో, హనుమకొండలో 1, నాగర్‌కునూల్‌లో 1, నల్గొండలో 1 కేసు నమోదయ్యాయి. డిసెంబర్ 26 నాటికి  తెలంగాణలో యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 65 , ఇంకా రికవరీ రేటు 99.5 . ఈ క్రమంలోనే కరోనా పరీక్షలను ముమ్మరంగా జరపడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.

Covid19 Cases In Hyderabad

Covid19 Cases In Hyderabad

వాక్సిన్ కేంద్రాల వద్ద రద్దీ..

చైనా, అమెరికా, యూకే, బ్రెజిల్ వంటి ప్రపంచ దేశాలలో పాటు స్థానికంగా హైదరాబాద్‌లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయన్న భయాందోళనల మధ్య హైదరాబాద్ ప్రజలు టీకా కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ముందు జాగ్రత్తగా బూస్టర్ డోస్‌లను వేయించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రాల వద్ద రద్దీ పెరుగుతోంది. వ్యాక్సిన్ వేయించుకోవాలనే ప్రయత్నంతో పాటు హైదరాబాదీలు కరోనా నిబంధనలను కూడా పాటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు హైదరాబాద్ విమానాశ్రయంలోని సిబ్బంది కూడా అంతర్జాతీయ ప్రయాణీకులను పరిశీలిస్తోంది. అంతర్జాతీయ విమానాల ద్వారా వచ్చిన ప్రయాణికులలో నుంచి రెండు శాతం మందిని రాపిడ్‌గా ఎన్నుకుని కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది.  

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Latest Articles