Online Shopping: ఒకే ఒక్క క్లిక్‌తో మీ పార్టీ కండువాలు.. కాలు కదపకుండానే జెండాలు.. ఆన్‌లైన్ షాప్‌లో మీ ముందుకు
అమెజాన్ అంటే అందరికీ తెలుసు... గుండుసూది నుంచి బైక్ ల వరకు అన్ని దొరుకుతాయి. కానీ ఇప్పుడు తాజాగా రాజకీయ పార్టీల జెండాలు, టోపీలు, కండువాలు కూడా అమ్మడం ఆసక్తిని కలిగిస్తుంది.
ప్రస్తుతం అంతా ఆన్‌లైన్ షాపింగ్ యుగం నడుస్తోంది. గుండి సూది నుంచి మొదలు.. పెద్ద స్టీమర్ల స్పెయిర్స్ వరకు ఇప్పుడు ఆన్‌లైన్‌లో లభిస్తున్నాయి. ఏ వస్తువు కావాలన్నా.. ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెడితే నిర్ణీత సమయంలో మన దగ్గరకు వచ్చేస్తోంది. గతంలో దుకాణాలు, మాల్స్‌కు వెళ్లి కావల్సిన వస్తువులు వెతుక్కుని, బిల్లింగ్ కోసం కాసేపు వెయిట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అనేక వెబ్ సైట్‌లు మనకు కావల్సిన అన్ని వస్తువులు ఇంటి వద్దకే డెలివరీ చేస్తున్నాయి. దీంతో ఫోన్ తీసుకుని కావల్సిన వస్తువులు ఆర్డర్ పెట్టేస్తున్నారు చాలా మంది. ఇదే సమయంలో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్న క్రమంలో కొంతమంది మోసాలకు గురవుతున్నారు. ఇప్పుడు రాజకీయ పార్టీల జెండాలు కూడా ఈ జాబితాలో వచ్చి చేరాయి. మీరు ఒక క్లిక్ చేస్తే చాలు మీ పార్టీ కండువా, టోపీ, జెండా ఇలా అన్ని మీ ముంగిట్లో వచ్చి వాలిపోతాయి. మీరు వీటి కోసం తిరగాల్సిన పనిలేదు. ఎందుకంటే ఇప్పుడు అన్ని పార్టీల వస్తువులు అమెజాన్ వంటి ఈ కామర్స్ సైట్స్‌లొ అందుబాటులోకి వచ్చాయి.
మామూలుగా రాజకీయ పార్టీలు కార్యకర్తలకు జెండాలు, కండువాలు ఉచితంగా పంపిణీ చేస్తాయి. ఇక ఎన్నికలు, బహిరంగ సభలు ఇలాంటివి జరిగినప్పుడు విచ్చలవిడిగా రోడ్లపైనే పడేసి కనిపిస్తూ ఉంటాయి. ఇంత ఫ్రీగా దొరికే రాజకీయ పార్టీల కండువాలు, జెండాలు ఆన్లైన్లో ఆర్డర్ చేసి మరి ఎవరు కొంటారు అనేది ఇంట్రెస్టింగ్గా మారింది.
కానీ సేల్స్ మాత్రం బాగానే జరుగుతున్నాయట.. ప్రస్తుతానికి జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల గుర్తులు, గుర్తులతో కూడిన జెండాలు కండువాలు టోపీలు ఇలా రకరకాల వస్తువులు అమ్ముతుంది ఆన్లైన్ మార్కెట్. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు.. మీ పార్టీ జెండాలను కొనేయండి. ఏమంటారు.. రెడీనా..
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం