Booster Dose: కరోనా బూస్టర్ డోస్‌ను ఇంకా తీసుకోలేదా..? అయితే అన్‌లైన్ ద్వారా ఎలా బుక్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి..
మన దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ భారత్ బయోటెక్ వారి ఇంట్రానాసల్ కోవిడ్ వ్యాక్సిన్(iNCOVACC)ను బూస్టర్ డోస్‌గా కేంద్ర ఆరోగ్య శాఖ ఆమోదించింది. నాసల్ డ్రాప్స్ ద్వారా ఇంట్రానాసల్ డెలివరీని అనుమతించడానికి..
మన దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ భారత్ బయోటెక్ వారి ఇంట్రానాసల్ కోవిడ్ వ్యాక్సిన్(iNCOVACC)ను బూస్టర్ డోస్‌గా కేంద్ర ఆరోగ్య శాఖ ఆమోదించింది. నాసల్ డ్రాప్స్ ద్వారా ఇంట్రానాసల్ డెలివరీని అనుమతించడానికి ఈ టీకాను ప్రత్యేకంగా రూపొందించారు. కరోనా నుంచి కాపాడుకునేందుకు iNCOVACC బూస్టర్ డోస్‌గా పని చేస్తుంది. ప్రస్తుతం ఇది ప్రైవేట్ టీకా కేంద్రాల ద్వారా అందుబాటులో ఉంది. కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోస్‌లను వేయించుకున్నవారు ఎవరైనా నాసల్ వ్యాక్సిన్‌ను తీసుకునేందుకు అర్హులు.
అయితే కోవిషీల్డ్, కోవాక్సిన్ వ్యాక్సిన్‌ల మాదిరిగానే, iNCOVACCను పొందడానికి కూడా ముందుగానే అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలి. ఈ అపాయింట్‌మెంట్‌లను డిసెంబర్ 23, 2022 నుంచి CoWIN వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవచ్చు.
కోవిడ్ నాసల్ వ్యాక్సిన్‌ను ఆన్‌లైన్‌లో ఎలా బుక్ చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..
స్టెప్ 1- https://www.cowin.gov.in/కి వెళ్లండి
స్టెప్ 2- మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేసుకోండి. ఇది వరకే నమోదు అయి ఉంటే.. OTP ద్వారా లాగిన్ చేయండి.
స్టెప్ 3- లాగిన్ అయిన తర్వాత, షెడ్యూల్ ఎంపిక కోసం సెర్చ్ చేయండి.
స్టెప్ 4- మీ పిన్‌కోడ్ లేదా జిల్లా పేరు ద్వారా టీకా కేంద్రం కోసం సెర్చ్ చేయవచ్చు.
స్టెప్ 5- మీ చాయిస్ ప్రకారం టీకా కేంద్రాన్ని ఎంచుకోండి.
స్టెప్ 6- నాసల్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ కోసం మీకు వీలైన తేదీ, సమయాన్ని ఎంచుకోండి.
స్టెప్ 7- తర్వాత మీ స్లాట్‌ను నిర్ధారించండి.
కాగా, iNCOVACC నాసల్ వ్యాక్సిన్ ధర ఇంకా ప్రకటించలేదు. మీరు టీకా కేంద్రంలోనే దాన్ని తెలుసుకోవాలి లేదా భారత్ బయోటెక్ తమ ధరను ప్రకటించేవరకు వేచి ఉండాలి. వెబ్‌సైట్ కోసం వేచి ఉండాలి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.