Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీళ్లది మామూలు ప్రేమకాదుగా..! ప్రియుడి కోసం ఎంతకు తెగించిందో తెలిస్తే షాక్‌ అవుతారు..

తమ ప్రేమను గెలిపించుకోవడానికి ఒక్కోసారి హద్దులు మీరుతుంటారు ప్రేమికులు. ఐతే గుజరాత్‌కు చెందిన 24 ఏళ్ల యువతి మాత్రం తన ప్రేమను గెలిపించుకోవడానికి ఏకంగా తన కెరీర్‌నే పనంగా పెట్టింది. ఇంతకీ ఏం చేసిందంటే..

వీళ్లది మామూలు ప్రేమకాదుగా..! ప్రియుడి కోసం ఎంతకు తెగించిందో తెలిస్తే షాక్‌ అవుతారు..
Woman Attends Boyfriends Exam
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 26, 2022 | 7:38 PM

తమ ప్రేమను గెలిపించుకోవడానికి ఒక్కోసారి హద్దులు మీరుతుంటారు ప్రేమికులు. ఐతే గుజరాత్‌కు చెందిన 24 ఏళ్ల యువతి మాత్రం తన ప్రేమను గెలిపించుకోవడానికి ఏకంగా తన కెరీర్‌నే పనంగా పెట్టింది. ఇంతకీ ఏం చేసిందంటే..

ఈ ఏడాది అక్టోబర్‌లో సెలవులకు ఉత్తరాఖండ్‌లో ఉన్న తన బాయ్‌ఫ్రెండ్‌ను కలవడానికి వెళ్లింది ఓ యువతి. సరిగ్గా ఆదే సమయానికి బాయ్‌ఫ్రెండ్ గారి బీకాం ఫైనల ఇయర్ పరీక్షలు కూడా వచ్చాయి. ఎన్నో ఏళ్లుగా డిగ్రీ కంప్లీట్‌ చెయ్యడానికి నానాతంటాలు పడుతున్న బాయ్‌ఫ్రెండ్‌కు ఓ మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వెంటనే కంప్యూటర్‌ జిమ్కిక్కులతో హాల్‌టికెట్‌లో మార్పులు చేశాడు. ఫొటోతోపాటు, పేరులో కూడా కొద్దిపాటి మార్పులు చేశాడు. రోజూ పరీక్షలకు ఒకే ఇన్విజిలేటర్‌ రావడం జరగదు కదా! అలాగే వచ్చే ఇన్విజిలేటర్లందరికీ పరీక్షలు రాసే విద్యార్ధుల ముఖాలు గుర్తుండవు. దీనినే అవకాశంగా తీసుకున్నారు ఈ జంట. అన్ని అనుకున్నట్లే జరిగాయి. ఇంకేముంది ఎగ్జాం రాయడానికి పరీక్ష హాలుకు కూడా వెళ్లింది ప్రేయసి. కానీ ఇంతలో అనుకోకుండా ఇన్విజిలేటర్‌కు పట్టుబడింది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎలా జట్టుబడ్డారనే కదా మీరు ఆలోచిస్తోంది. అబ్బాయి కూర్చోవల్సిన సీటు నెంబర్‌లో ఓ అమ్మాయి కూర్చుని పరీక్ష రాయడాన్ని గమనించిన సూపర్‌వైజర్ అంతాబట్టబయలు చేశాడు. వీర్ నర్మద్ సౌత్ గుజరాత్ యూనివర్సిటీ (VNSGU)లో అక్టోబర్‌లో జరిగిన బీకాం మూడో సంవత్సరం పరీక్షల్లోనే ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో సదరు వ్యక్తి గతంలో ఉత్తీర్ణత పొందిన రెండేళ్ల డిగ్రీని రద్దు చేసి, మూడేళ్లపాటు డీబార్‌ చేశారు అధికారులు. ఇక అప్పటికే ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న యువతిపై చీటింగ్‌ కేసు నమోదు చేశారు. ఫలితంగా ఆమె ఉద్యోగం పోయే పరిస్థితి నెలకొందని ఫాక్ట్‌ కమిటీ కన్వీనర్ స్నేహల్ జోషి మీడియాకు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.