AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICICI Loan Fraud Case: ఐసీఐసీఐ బ్యాంకు కోట్ల రూపాయల కుంభకోణం కేసులో వీడియోకాన్ గ్రూప్ ఛైర్మాన్ అరెస్టు!

ఐసీఐసీఐ బ్యాంకు లోను కేసులో వీడియోకాన్ గ్రూప్ ఛైర్మాన్ వేణుగోపాల్ ధూత్‌ను సీబీఐ సోమవారం (డిసెంబర్ 26) అరెస్టు చేసింది. వీడియోకాన్ గ్రూప్‌ కంపెనీలకు మంజూరు చేసిన రూ.3 వేల కోట్లకుపైగా రుణంలో..

ICICI Loan Fraud Case: ఐసీఐసీఐ బ్యాంకు కోట్ల రూపాయల కుంభకోణం కేసులో వీడియోకాన్ గ్రూప్ ఛైర్మాన్ అరెస్టు!
Videocon CEO Venugopal Dhoot
Srilakshmi C
|

Updated on: Dec 26, 2022 | 4:14 PM

Share

ఐసీఐసీఐ బ్యాంకు లోను కేసులో వీడియోకాన్ గ్రూప్ ఛైర్మాన్ వేణుగోపాల్ ధూత్‌ను సీబీఐ సోమవారం (డిసెంబర్ 26) అరెస్టు చేసింది. వీడియోకాన్ గ్రూప్‌ కంపెనీలకు మంజూరు చేసిన రూ.3 వేల కోట్లకుపైగా రుణంలో అవకతవకలు జరిగాయని ఆరోపణల్లో భాగంగా ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్ (59), ఆమె భర్త దీపక్ కొచ్చర్‌లను సీబీఐ గత శుక్రవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన రెండు రోజుల వ్యవధిలోనే వీడియోకాన్ గ్రూప్ ఛైర్మాన్ వేణుగోపాల్ ధూత్‌ కూడా అరెస్టయ్యారు. ముంబై కోర్టులో హాజరుపరిచిన తర్వాత వీరిని విచారించనున్నారు.

వేణుగోపాల్ ధూత్ ప్రమోట్ చేసిన వీడియోకాన్ గ్రూప్ కంపెనీలకు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, బ్యాంక్ క్రెడిట్ పాలసీ, ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించి ఐసీఐసీఐ బ్యాంక్ రూ.3,250 కోట్ల లోను మంజూరు చేసిందని సీబీఐ ఆరోపించింది. చందా కొచ్చర్ తన అధికారాన్ని దుర్వినియోగం చేసి వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్‌కు రూ.300 కోట్ల క్రెడిట్ సదుపాయాన్ని మంజూరు చేయడం ద్వారా నేరానికి పాల్పడ్డారని సీబీఐ చెబుతోంది. 2010 నుంచి 2012 మధ్య కాలంలో రుణాన్ని మంజూరు చేసిన తర్వాత, వీడియోకాన్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వేణుగోపాల్ ధూత్ నుంచి వచ్చిన రూ.64 కోట్లను తన భర్త కంపెనీ నూపవర్ రెన్యూవబుల్ లిమిటెడ్‌లో పెట్టుబడిగా పెట్టి, తన సొంత అవసరాల కోసం వినియోగించినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. వీడియోకాన్ గ్రూప్‌ కంపెనీలకు అనుకూలంగా జారీ చేసిన రుణాలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న చందా కొచ్చర్‌ను ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్‌ అధికారం నుంచి 2018 అక్టోబర్‌లో తొలగించిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.