AP Police jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచుతూ జగన్‌ సర్కార్ నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నిరుద్యోగులకు జగన్‌ సర్కార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇటీవల విడుదల చేసిన 6,511 పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు..

AP Police jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచుతూ జగన్‌ సర్కార్ నిర్ణయం
Age Relaxation For Ap Police Jobs
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 23, 2022 | 1:44 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నిరుద్యోగులకు జగన్‌ సర్కార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇటీవల విడుదల చేసిన 6,511 పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు రెండేళ్ల పాటు వయసు పొడిగిస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం (డిసెంబర్‌ 23) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన పోలీస్‌ ఉద్యోగాలకు వయో పరిమితి సడలింపుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనుమతి ఇచ్చారు. కానిస్టేబుల్‌ అభ్యర్థుల వినతి మేరకు సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 6,511 ఎస్‌ఐ, రిజర్వ్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌, కానిస్టేబుల్, ఏపీఎస్‌పీ రిజర్వ్‌ సబ్‌ఇన్స్‌పెక్టర్‌ పోలీసు నియమకాలకు డిసెంబర్‌ 28, జనవరి 18 తేదీల్లో దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. ఎస్‌ఐ పోస్టులు 411, కానిస్టేబుల్‌ పోస్టులు 6,100 వరకు ఉన్నాయి. ఈ పోస్టులన్నింటికీ పురుషులు, మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీఎస్‌పీ రిజర్వ్‌ సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ పోస్టులకు పురుషులు మాత్రమే అర్హులు. కానిస్టేబుల్‌ పోస్టులకు జనవరి 22న, ఎస్సై పోస్టులకు ఫిబ్రవరి 19న ప్రిలిమనరీ రాత పరీక్ష నిర్వహిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.