TSPSC: తెలంగాణలో నిరుద్యోగులకు మరో శుభవార్త.. పశుసంవర్ధక శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఇటీవల ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్స్‌ జారీ చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసిన టీఎస్‌పీఎస్సీ తాజాగా మరో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది...

TSPSC: తెలంగాణలో నిరుద్యోగులకు మరో శుభవార్త.. పశుసంవర్ధక శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.
Tspsc Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 23, 2022 | 5:25 PM

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఇటీవల ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్స్‌ జారీ చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసిన టీఎస్‌పీఎస్సీ తాజాగా మరో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. వెటర్నరీ అండ్‌ పశుసంవర్ధక శాఖలో 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్(క్లాస్-ఎ & బి)పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. మల్టీజోన్‌-1, మల్టీజోన్‌-2లో ఖాళీలను భర్తీ చేయనుంది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 185 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్-ఎ) 170, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్‌-బి) (15) పోస్టులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్‌ (క్లాస్‌-ఎ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీ (వెటర్నరీ సైన్సెస్, యానిమల్ హస్బెండరీ) లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్-బి) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీ (వెటర్నరీ సైన్సెస్, యానిమల్ హస్బెండరీ), పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా పీజీ డిప్లొమా(మైక్రోబయాలజీ/ పారాసిటాలజీ/ ఎపిడెమియాలజీ/ వైరాలజీ/ ఇమ్యునాలజీ/ పాథాలజీ) లేదా మాస్టర్స్ డిగ్రీ(వెటర్నరీ సైన్స్) లేదా ఎంవీఎస్సీ(వెటర్నరీ పబ్లిక్ హెల్త్‌) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 01-07-2022 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తు ఫీజుగా రూ. 320 చెల్లించాల్సి ఉంటుంది.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 54,220 నుంచి రూ. 1,33,630 వరకు చెల్లిస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ 30-12-2022న మొదలై 19-01-2023తో ముగియనుంది.

* రాత పరీక్షను 2023 మార్చి 15, 16 తేదీల్లో నిర్వహిస్తారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో