AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vegetable Prices: సామాన్యులపై మరో బండ.. భారీగా పెరిగిన కూరగాయల ధరలు.. టమాటా, మిర్చి పైపైకి..

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు పెరిగాయి. కొద్ది నెలల క్రితం కిలో టమాట రూ.15కే లభించగా.. ఇప్పుడు ఏకంగా రూ.50కి చేరుకుంది. ఇక మిగతా కూరగాయల ధరలు కూడా భగ్గుమంటున్నాయి. పెరిగిన ధరలతో సామాన్యులకు ఖర్చు పెరుగుతోంది. రోజువారీ కూలీ చేసుకుని జీవనం కొనసాగించేవారికి పెరిగిన ధరలు షాక్ ఇస్తున్నాయి.

Vegetable Prices: సామాన్యులపై మరో బండ.. భారీగా పెరిగిన కూరగాయల ధరలు.. టమాటా, మిర్చి పైపైకి..
Vegetable
Venkatrao Lella
|

Updated on: Jun 10, 2026 | 3:46 PM

Share

సామాన్యులకు బిగ్ షాక్ తగిలింది. తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. వర్షాల వల్ల ఉత్పత్తి తగ్గిపోవడంతో సరఫరా తగ్గింది. దీని వల్ల కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. దీంతో సామాన్యులు నిత్యావసర సరుకులకు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు ఇటీవల లీటర్‌పై రూ.7.50 మేర పెరిగాయి. దీంతో రవాణా ఖర్చులు పెరగడం కూడా కూరగాయల ధరలపై ప్రభావం చూపుతోంది. ఇంధన ధరలు పెరిగినప్పుడు సాధారణంగా నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతూ ఉంటాయి. ఒకవైపు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెరగ్గా.. కూరగాయల ధరలు కూడా పెరగడంతో సామాన్యులపై భారం పడుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

హైదరాబాద్‌లో..

హైదరాబాద్‌లోని రైతు మార్కెట్లలో కిలో టమాటా రూ.43, వంట రూ.23, బెండకాయ రూ.40, పచ్చిమిర్చి రూ.40, క్యాలీఫ్లవర్ రూ.18, క్యాబేజీ రూ.19, క్యారెట్ రూ.42, దొండకాయ రూ.50, ఆలు రూ.17, ఉల్లిపాయ రూ.22, సొరకాయ రూ.13, పొట్లకాయ రూ.13, బీన్స్ రూ.75, గోరుచిక్కుడు రూ.35, చిక్కుడుకాయ రూ.45, దోస రూ.18, బీరకాయ రూ.40, కాకర రూ.45, చామగడ్డ రూ.28, కీర రూ.35, క్యాప్చికం రూ.70, బీట్ రూట్ రూ.25, కందగడ్డ రూ.28, చిలకడదుంప రూ.18, మామిడ రూ.23, మునగ రూ.40 పలుకుతున్నాయి.

విజయవాడలో రేట్లు ఇలా..

ఇక విజయవాడలోని రైతు మార్కెట్లలో కేజీ టమాట రూ.49, వంగ రూ.35, బెండ రూ.38, పచ్చిమిర్చి రూ.34, కాకర రూ.48, క్యాబేజీ రూ.30, క్యారెట్ రూ.40, దొండకాయ రూ.40, బంగాళదుంప రూ.23, ఉల్లిపాయలు రూ.23, గోరుచిక్కుడు రూ.38, దోస రూ.20, సొర రూ.20, చిక్కుళ్లు రూ.90, చామదుంప పరూ.28, కంద రూ.38, బీట్ రూట్ రూ.30, కీరదోస రూ.42, బీన్స్ రూ.90, క్యాప్చికం రూ.85, అలసందలు రూ.36, చిలకడదుంప రూ.30కు లభిస్తున్నాయి.

గుంటూరులో ఇలా..

ఇక గుంటూరులోని ఎన్టీఆర్ రైతు బజార్‌లో కిలో టమాట రూ.43, వంగ రూ.40, బెండకాయ రూ.39, పచ్చిమిర్చి రూ.30, కాకర రూ.48, క్యారెట్ రూ.45, క్యాబేజీ రూ.33, బీరకాయ రూ.45, దొండకాయ రూ.24, బంగాళదుంప రూ.22, ఉల్లిపాయ రూ.22, గోరుచిక్కుళ్లు రూ.36, దోస రూ.18, పొట్లకాయ రూ.40, చామ రూ.27, గోంగూరు రూ.8, తోటకూర రూ.15, చుక్కకూర రూ.15, మెంతికూర రూ.5, కొత్తిమీర రూ.25, బీట్ రూట్ రూ.31, కీర రూ.39, క్యాప్సికం రూ.74, అల్లం రూ.140, ఫ్రెంచి బీన్స్ రూ.95, సొర రూ.10, అరటి రూ.8గా ఉన్నాయి.

Follow Us