AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Prices: రూ.10 వేలు పెరిగిన బంగారం ధర.. మరింత పెరిగే ఛాన్స్..? ఇప్పుడే జాగ్రత్త పడండి..

బంగారం ధరలు గత 15 రోజులుగా పెరుగుతూ వస్తోన్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలతో పాటు రష్యా-ఉక్రెయిన్ యుద్దం తీవ్రతరం అవ్వడంతో గోల్డ్ రేట్లు భారీగా పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. రానున్న రోజుల్లో మరింత పెరగనున్నాయనే సంకేతాలు ఇస్తున్నాయి. ఇవాళ తగ్గి కాస్త ఊరటనిచ్చాయి.

Gold Prices: రూ.10 వేలు పెరిగిన బంగారం ధర.. మరింత పెరిగే ఛాన్స్..? ఇప్పుడే జాగ్రత్త పడండి..
Gold Prices
Venkatrao Lella
|

Updated on: Aug 14, 2026 | 12:13 PM

Share

బంగారం ధరల్లో హెచ్చుతగ్గుతున్నాయి. మధ్యప్రాచర్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తలు ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఇరాన్‌పై కఠిన చర్యలు తీసుకునేందుకు అమెరికా త్వరలో సిద్దం కానుందని అమెరికా ఆర్థికశాఖ మంత్రి స్కాట్ బెసెంట్ ప్రకటించడం, హర్ముజ్ జలసంధిపై అనిశ్చితి కొనసాగుతుండటంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ సమయంలో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. గురువారం 2 శాతం తగ్గగా.. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 87.07కి చేరుకుంది. ఈ వారంలో ఇప్పటివరకు ధరలు 4 శాతం మేర పెరిగాయి. ముడి చమురు ధరలు పెరుగుతున్న క్రమంలో బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. దీంతో గత కొంతకాలంగా వీటి ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

రూ.10 వేలు పెరిగిన బంగారం

బంగారం ధరలు గత 15 రోజుల్లో ఏకంగా రూ.10 వేల మేర పెరిగాయి. జులై 31వ తేదీ నుంచి పెరుగుతూ వస్తోన్నాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలతో ర్యాలీని కొనసాగిస్తున్నాయి. జులై 31 నుంచి ఆగస్ట్ 14 మధ్య రూ.10 వేల మేర బంగారం పెరిగింది. జులై 31న రూ.1,42,860 వద్ద ఉండగా.. ఆగస్ట్ 14 నాటికి రూ.1,52,890కి చేరుకుంది. అంటే రూ.10 వేలుపైబడి పెరిగిందని చెప్పవచ్చు. అంతర్జాతీయ బెంచ్ మార్క్ కామెక్స్‌లో 8.99 శాతం పెరగ్గా.. LBMAలో 9.94 శాతం పెరిగాయి. హెచ్చుతగ్గుల క్రమంలో బంగారంలో పెట్టుబడులు పెట్టాలా.. వద్దా అనే దానిపై ఇన్వెస్టర్లు పునరాలోచనలో పడ్డారు. ఇప్పటికే పెట్టుబడులు పెట్టినవారు తమ ఇన్వెస్ట్‌మెంట్లను అలాగే ఉంచుకోవాలి, కొత్తగా కొనాలనుకునేవారు చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టాలని నిపుణులు చెబుతున్నారు.

గోల్డ్ ధరల పెరుగుదలకు కారణాలేంటి..?

అమెరికా-ఇరాన్ మధ్య యుద్దం తీవ్రతరం కావడం, ద్రవ్యోల్బణం, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లపై ఇందోళనలు, చమురు ధరల పెరుగుదల బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలో బంగారాన్ని సురక్షిత ఆస్తిగా పెట్టుబడిదారులు భావిస్తున్నారు. ఇరాన్‌పై నావికా దిగ్బంధనాన్ని కొనసాగిస్తామని అమెరికా హెచ్చరించడంతో భౌగోళిక రాజకీయ అనిశ్చితి పెరిగింది. ఇక ఆర్ధిక వృద్ధి, ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి యూఎస్ ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ తక్షణమే వడ్డీ రేట్లు పెంచాలని క్లీవ్‌ల్యాండ్ ఫెడరల్ రిజర్వ్ ప్రెసిడెంట్ బెత్ హమ్మాక్ సూచించారు. ఈవ్యాఖ్యలు ఫెడ్ తరుపరి నిర్ణయంపై ఆసక్తిని పెంచింది. అయితే వచ్చే నెలలో ఫెడ్ వడ్డీ రేట్లను పెంచకపోవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. అమెరికా ద్రవ్యోల్బణ డేటా విడుదల అయ్యాక ఇప్పట్లో పెంచకపోవచ్చనే ప్రచారం సాగుతోంది. ఈ గందరగోళం క్రమంలో ఇన్వెస్టర్లు అమోమయానికి గురవుతున్నారు.  ప్రస్తుతం గోల్డ్‌లోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుండటంతో ధరలు పెరుగుతూ వస్తోన్నాయి.

Follow Us