AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేడు జాతినుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం! లైవ్ ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?

80వ స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆగస్టు 14న సాయంత్రం 7 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆకాశవాణి జాతీయ నెట్‌వర్క్, దూరదర్శన్ ఛానెళ్లలో ప్రసారం కానుంది. ముందుగా హిందీ, ఆ తర్వాత ఆంగ్లంలో ప్రసారం చేస్తారు. అనంతరం ప్రాంతీయ భాషల్లో కూడా ప్రసారం అందుబాటులో ఉంటుంది.

నేడు జాతినుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం! లైవ్ ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
President Droupadi Murmu Independence Day Speech 2026
SN Pasha
|

Updated on: Aug 14, 2026 | 1:04 PM

Share

భారతదేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న వేళ.. స్వాతంత్ర్య దినోత్సవానికి ఒక రోజు ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆగస్టు 14న సాయంత్రం 7 గంటలకు రాష్ట్రపతి ప్రసంగం ప్రారంభం కానుంది. దేశం సాధించిన విజయాలు, ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లు, భవిష్యత్తు ఆకాంక్షలను ప్రతిబింబించేలా రాష్ట్రపతి సందేశం ఉండే అవకాశం ఉంది.

లైవ్ వీడియో చూడండి

రాష్ట్రపతి ప్రసంగాన్ని ఆకాశవాణి (ఆల్ ఇండియా రేడియో) జాతీయ నెట్‌వర్క్‌లో ప్రసారం చేయనున్నారు. అదే సమయంలో దూరదర్శన్‌కు చెందిన అన్ని ఛానెళ్లలో ప్రసంగాన్ని ప్రత్యక్షంగా ప్రసారం చేస్తారు. దీంతో దేశవ్యాప్తంగా ప్రజలు టెలివిజన్, రేడియోతో పాటు అధికారిక డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా రాష్ట్రపతి సందేశాన్ని వీక్షించవచ్చు, వినవచ్చు. అధికారిక ప్రసార వివరాల ప్రకారం.. రాష్ట్రపతి ప్రసంగం మొదట హిందీ భాషలో, అనంతరం ఆంగ్లంలో ప్రసారం అవుతుంది. హిందీ, ఆంగ్ల ప్రసారాలు పూర్తైన తర్వాత దూరదర్శన్‌కు చెందిన ప్రాంతీయ ఛానెళ్లలో వివిధ ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేయనున్నారు. ఆకాశవాణి కూడా సంబంధిత ప్రాంతీయ నెట్‌వర్క్‌లలో అదే ప్రసంగానికి సంబంధించిన ప్రాంతీయ భాషా వెర్షన్లను రాత్రి 9.30 గంటలకు ప్రసారం చేయనుంది.

ఎక్కడ చూడొచ్చు?

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగాన్ని దూరదర్శన్, డీడీ న్యూస్, ఆకాశవాణి అధికారిక ప్రసార వేదికల్లో వీక్షించవచ్చు. అలాగే ప్రసార భారతి, దూరదర్శన్‌కు చెందిన అధికారిక డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలోనూ ప్రసారం అందుబాటులో ఉంటుంది. ఆకాశవాణి జాతీయ నెట్‌వర్క్ ద్వారా రేడియోలో కూడా ప్రత్యక్ష ప్రసారం వినే అవకాశం ఉంటుంది. ప్రాంతీయ దూరదర్శన్ ఛానెళ్లు, ప్రాంతీయ ఆకాశవాణి నెట్‌వర్క్‌ల ద్వారా తర్వాత ప్రాంతీయ భాషల్లోనూ ప్రసంగాన్ని వినవచ్చు. అలాగే టీవీ9 తెలుగు న్యూస్ ఛానెల్‌లో సైతం ప్రసారం అందుబాటులో ఉంటుంది.

Follow Us
అసలు క్రికెట్ హిస్టరీలో ఎన్ని రకాల డకౌట్స్ ఉన్నాయో తెలిస్తే షాకే.
అసలు క్రికెట్ హిస్టరీలో ఎన్ని రకాల డకౌట్స్ ఉన్నాయో తెలిస్తే షాకే.
ఇంటి ముందు కారు పార్కింగ్‌కు రూ. 25 వేలు చెల్లించాల్సిందే!
ఇంటి ముందు కారు పార్కింగ్‌కు రూ. 25 వేలు చెల్లించాల్సిందే!
టెస్ట్ క్రికెట్ చరిత్రలో స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డు..
టెస్ట్ క్రికెట్ చరిత్రలో స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డు..
బంగారం లాంటోడిని బండరాయిలా మార్చింది మీ ముగ్గురే..: మాజీ ప్లేయర్
బంగారం లాంటోడిని బండరాయిలా మార్చింది మీ ముగ్గురే..: మాజీ ప్లేయర్
ఓరి నాయనో.. 5.3 సెకన్లలో 800 కిమీ వేగం!
ఓరి నాయనో.. 5.3 సెకన్లలో 800 కిమీ వేగం!
విదుర నీతి: జీవితంలో ఈ విషయాలను ఎవరికీ చెప్పకండి.. చెబితే సమస్యలు
విదుర నీతి: జీవితంలో ఈ విషయాలను ఎవరికీ చెప్పకండి.. చెబితే సమస్యలు
ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రైవేట్ డాక్టర్ల విధులు.. ఇదేం తీరు..
ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రైవేట్ డాక్టర్ల విధులు.. ఇదేం తీరు..
విద్యార్థుల ఏకాగ్రత పెంచేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయం!
విద్యార్థుల ఏకాగ్రత పెంచేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయం!
ప్రభాస్ ఇన్ స్టాలో ఫాలో అయ్యే ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా.?
ప్రభాస్ ఇన్ స్టాలో ఫాలో అయ్యే ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా.?
ఒక ఫోన్ నుంచి మరొక ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టుకోవచ్చా..?
ఒక ఫోన్ నుంచి మరొక ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టుకోవచ్చా..?