AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Soft Idli Recipe: పిండి రుబ్బేటప్పుడు ఇదొక్కటి వేస్తే చాలు.. ఇడ్లీలు మెత్తగా, దూదిలా రావాల్సిందే!

Soft Idli Making Tips: మన సౌతిండియాలో మార్నింగ్ బ్రేక్‌ పాస్ట్ అనగానే గుర్తొచ్చే ఫస్ట్ టిఫిన్ ఇడ్లీ. ఇది రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే ఇంట్లో చేసుకున్నప్పుడు ఇడ్లీలు కాస్త గట్టిగా వస్తుంటాయి. కానీ కొన్ని చిట్కాలు పాటిస్తే.. మీరు హోటల్‌ స్టైల్‌ మెత్తగా దూదిలాంటి ఇడ్లీలను ఇంట్లోనే చేసుకోవచ్చు. అదేలానో ఇక్కడ చూద్దాం.

Soft Idli Recipe: పిండి రుబ్బేటప్పుడు ఇదొక్కటి వేస్తే చాలు.. ఇడ్లీలు మెత్తగా, దూదిలా రావాల్సిందే!
Soft Idli Recipe
Anand T
|

Updated on: Aug 14, 2026 | 1:15 PM

Share

మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఆరోగ్యకరమైన వంటకం ఏదైనా ఉందంటే.. అది ఇడ్లీ మాత్రమే.. మన సౌతిండియాలో ఇది మస్తు ఫేమస్. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ వీటిని తినేందుకు ఇష్టపడుతారు. అయితే మన ఇంట్లో చేసుకున్నప్పుడు ఇవి.. రెస్టారెంట్లలో లభించే మెత్తగా, దూదిలా ఉండే ఇడ్లీల్లా కాకుండా కాస్త గట్టిగా వస్తాయి. కానీ ఇక్కడ ఓ షెప్ చెప్పిన కొన్ని టిప్స్ పాటిస్తే మీరు కూడా ఇంట్లోనే హోటల్ స్టైల్ సాఫ్ట్ ఇడ్లీలను చేసుకోవచ్చు.

అవును నిపుణులైన షెప్‌ల ప్రకారం.. ఇడ్లీలు షాఫ్ట్‌గా రావాలంటే.. ఇడ్లీకి నానబెట్టిన బియ్యం, మినప్పప్పును రుబ్బేటప్పుడు అందులో కొద్దిగా అటుకులు వేయాలని సూచిస్తున్నారు. ఇలా మూడింటిని కలిపి రుబ్బితే ఇడ్లీలు ఎంతో మృదువుగా, దూదిలా వస్తాయని చెబుతున్నారు. కాబట్టి వీటిని స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో తెలుసుకుందాం.

దూదిలాంటి ఇడ్లీలు తయారు చేసేందుకు కావలసిన పదార్థాలు

  • బియ్యం: 3 కప్పులు
  • మినప్పప్పు: 1 కప్పు
  • పల్చటి అటుకులు: ½ కప్పు
  • ఉప్పు: రుచికి సరిపడా
  • నీరు: తగినంత
  • నూనె: ఇడ్లీ పాత్రలకు రాయడానికి సరిపడా

దూదిలాంటి ఇడ్లీల తయారీ విధానం

  • స్టెప్-1: మీకు హోటల్‌ స్టైల్‌లో దూదిలాంటి మెత్తటి ఇడ్లీలు రావాలంటే.. ముందుగా బియ్యం, మినప్పప్పు, అటుకులను వేర్వేరు పాత్రలలో 4 నుండి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి.
  • స్టెప్-2: ఇప్పుడు నానిన మినప్పప్పును పిండి తేలికగా, నురుగు వచ్చేలా మెత్తగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత బియ్యం, అటుకులను కూడా మెత్తగా రుబ్బి, ఈ మిశ్రమాలన్నింటినీ ఒక పెద్ద గిన్నెలో కలపాలి.
  • స్టెప్-3: తర్వాత పిండిలో రుచికి సరిపడ ఉప్పు వేసి బాగా కలిపి, 8 నుండి 10 గంటల పాటు పులియపెట్టాలి. అవసరమైతే చిటికెడు బేకింగ్ సోడా కూడా కలుపుకోవచ్చు
  • స్టెప్-4: తర్వాత ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా నూనె రాసి, అందులో తగినంత పిండి వేసి. ఇడ్లీ కుక్కర్ లేదా పాత్రలో ఆవిరిపై సుమారు 5 నుండి 10 నిమిషాలు ఉడికించాలి.
  • స్టెప్-5: అంతే వేడివేడిగా, ఎంతో మెత్తగా ఉండే దూది లాంటి ఇడ్లీలు రెడీ అయినట్టే. వీటిని పల్లీల చట్నీ, అల్లం చట్నీ లేదా లేదా వేడివేడి సాంబార్‌తో తింటే ఇలా నోట్లో పెట్టగానే అలా కరిగిపోతాయి. ఈ సారి మీరు కూడా ట్రై చేయండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అరెరే ఇన్నాళ్లు తెలీదే.. పాలపై మందపాటి మీగడ తేవడం ఇంత ఈజీనా
అరెరే ఇన్నాళ్లు తెలీదే.. పాలపై మందపాటి మీగడ తేవడం ఇంత ఈజీనా
నేడు జాతినుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం!
నేడు జాతినుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం!
ఆగస్టు 15కి ముందే స్వాతంత్ర్య వేడుకలు.. ఈ 2ఆలయాల్లో ప్రత్యేకత..
ఆగస్టు 15కి ముందే స్వాతంత్ర్య వేడుకలు.. ఈ 2ఆలయాల్లో ప్రత్యేకత..
చంద్రుని చల్లని చూపు.. శ్రావణ మాసంలో శుభవార్తలు అందుకునే రాశులివే
చంద్రుని చల్లని చూపు.. శ్రావణ మాసంలో శుభవార్తలు అందుకునే రాశులివే
పిండి రుబ్బేటప్పుడు ఇదొక్కటి వేస్తే చాలు..ఇడ్లీలు మెత్తగా వస్తాయి
పిండి రుబ్బేటప్పుడు ఇదొక్కటి వేస్తే చాలు..ఇడ్లీలు మెత్తగా వస్తాయి
ఏపీకి రెయిన్ అలర్ట్.. మూడ్రోజుల పాటు వర్షాలు
ఏపీకి రెయిన్ అలర్ట్.. మూడ్రోజుల పాటు వర్షాలు
9 వేల రన్స్.. 22 సెంచరీలు.. అయినా ఒక్క టెస్ట్ ఆడని మనోడు
9 వేల రన్స్.. 22 సెంచరీలు.. అయినా ఒక్క టెస్ట్ ఆడని మనోడు
తొందరపాటు నిర్ణయాలు వద్దూ.. ఈ రాశి వారు మాట జారితే అన్నీ బాధలే
తొందరపాటు నిర్ణయాలు వద్దూ.. ఈ రాశి వారు మాట జారితే అన్నీ బాధలే
స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం మధ్య తేడా ఏంటి..?
స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం మధ్య తేడా ఏంటి..?
బంగారం కొనడానికి ఇది మంచి సమయం.. కుబేరుడి అనుగ్రహంతో వీరికి డబ్బే
బంగారం కొనడానికి ఇది మంచి సమయం.. కుబేరుడి అనుగ్రహంతో వీరికి డబ్బే