AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Charles Sobhraj: నేపాల్‌ జైలు నుంచి విడుదలైన సీరియల్‌ కిల్లర్‌ చార్లెస్ శోభరాజ్‌.. 19 ఏళ్ల కారాగార జీవితం తర్వాత..

కరడుగట్టిన సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ (78) శుక్రవారం (డిసెంబర్‌ 23) నేపాల్‌ జైలు నుంచి విడుదలయ్యాడు. వృద్ధాప్యం, ఆరోగ్యం కారణంగా చార్లెస్ శోభరాజ్‌ను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించి..

Charles Sobhraj: నేపాల్‌ జైలు నుంచి విడుదలైన సీరియల్‌ కిల్లర్‌ చార్లెస్ శోభరాజ్‌.. 19 ఏళ్ల కారాగార జీవితం తర్వాత..
Serial killer Charles Sobhraj
Srilakshmi C
| Edited By: Janardhan Veluru|

Updated on: Dec 23, 2022 | 3:17 PM

Share

కరడుగట్టిన సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ (78) శుక్రవారం (డిసెంబర్‌ 23) నేపాల్‌ జైలు నుంచి విడుదలయ్యాడు. వృద్ధాప్యం, ఆరోగ్యం కారణంగా చార్లెస్ శోభరాజ్‌ను విడుదల చేయాలని ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. 1975లో ఇద్దరు అమెరికన్ టూరిస్టులను హత్య చేసిన కేసులో శోభరాజ్‌కు నేపాల్‌ కారాగారంలో 18 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించాడు. శిక్షాకాలంలో దాదాపు 75 శాతాన్ని పూర్తిచేసుకొని, సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేసేందుకు శోభారాజ్‌ నేపాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అతని పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ఫ్రెంచ్ జాతీయుడైన శోభరాజ్ ఆగ్నేయాసియా దేశాల్లో 20 కంటే ఎక్కువ మందిని హత్య చేశాడు. వారిని దోచుకునే క్రమంలో వారి ఆహారం, పానీయాల్లో మత్తుమందు ఇచ్చి చంపాడు. మారువేషాల్లో పలుమార్లు పోలీసుల నుంచి తప్పించుకోవడంతో ‘బికినీ కిల్లర్’, ‘ది సర్పెంట్’ అనే పేర్లతో అప్పట్లో మారుమోగిపోయాడు. థాయ్‌లాండ్‌తో సహా అనేక హత్యలకు పాల్పడ్డాడు. ఇక్కడ మన దేశంలోకూడా 1970లలో ఆరుగురు మహిళలకు మత్తుమందు ఇచ్చి చంపాడు. హత్య చేసిన వారిలో కొందరి మృతదేహాలు పట్టాయా రిసార్ట్ సమీపంలోని బీచ్‌లో దొరికాయి. వాస్తవంగా అతను ఎంతమందిని చంపాడనే విషయం ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.