- Telugu News Photo Gallery World photos These Photos reveals Western world's shameful secret of Human zoos
Human Zoo: సూడోసైన్స్ గురించి మీకు తెలుసా..? ఆ దేశాల్లో జంతువుల మాదిరి ‘జూ’లలో అమానుషంగా మనుషులను ఉంచి..
ఆఫ్రికా దేశాలు, ఇతర ప్రాంతాలకు చెందిన మనుషులను పట్టుకొచ్చి జంతువుల్లాగా యూరప్ వలస పాలకులు ‘జూ’లు ఏర్పాటు చేసేవారు. సముద్రాలను దాటి ఇతర ఖండాలకు అన్వేషణ మొదలైనప్పటి నుంచీ కొనసాగిన ఈ మానవ జులు రెండో ప్రపంచ యుద్ధం..
Updated on: Dec 23, 2022 | 1:13 PM

ఆఫ్రికా దేశాలు, ఇతర ప్రాంతాలకు చెందిన మనుషులను పట్టుకొచ్చి జంతువుల్లాగా యూరప్ వలస పాలకులు ‘జూ’లు ఏర్పాటు చేసేవారు. సముద్రాలను దాటి ఇతర ఖండాలకు అన్వేషణ మొదలైనప్పటి నుంచీ కొనసాగిన ఈ మానవ జులు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వలస రాజ్యాలు కుప్పకూలే వరకూ కొనసాగాయి.

స్పానిష్ చరిత్ర ప్రకారం.. పదిహేనో శతాబ్దం ఆరంభంలో ప్రస్తుత మెక్సికో ప్రాంతంలో ఉన్న ఆజ్టెక్ సామ్రాజ్యంలో 'మాక్టెజుమా జూ' ఉండేది. దీనిలో 'బఫూన్లు, మరుగుజ్జులు, గూని వంటి అంగవైకల్యం ఉన్న మనుషులను ప్రదర్శనకు పెట్టేవారు. అప్పట్లో శారీరక వైకల్యాలను అపశకునాలుగా భావించేవారు. దుష్టశక్తులకు సాక్ష్యాలుగా భావించేవారు. వీళ్లను ఊరూరా తిప్పి ప్రదర్శించేవారు.

పద్నాలుగో శతాబ్దం మధ్య నుంచి పదిహేడో శతాబ్దం వరకూ ఇటలీ దేశంలో అన్ని రకాల జంతువులతో పాటు, ఇతర వేశాలకు చెందిన 20కి పైగా భాషలు మాట్లాడే ఆటవికులను కూడా తమ జూలలో ఉండేవారని ఇటాలియన్ చరిత్రకారులు తమ రచనల్లో తెలిపారు. యూరప్ ప్రజలకు భిన్నంగా కనిపించే మనుషులు తన దగ్గర ఉన్నారని, వారితో పాటు శారీరక మార్పులతో పుట్టిన వారిని కూడా ప్రదర్శిస్తున్నామని చెప్పారు.

ఇలాంటి అమానవీయ పరిస్థితులు కొన్ని వందల ఏళ్ల తర్వాత కూడా పశ్చిమ సమాజాల్లో కనిపించాయి. పారిస్, లండన్, న్యూయార్క్, బెర్లిన్ వంటి నగరాల్లో ప్రదర్శనకు ఉంచిన విదేశీ మానవ 'నమూనా'లను చూసేందుకు ప్రజలు ఓడల్లో తరలివచ్చేవారు

సూడోసైన్స్‌గా చెప్పబడుతున్న 'మానవ జూ'లను 19వ శతాబ్ధంలో అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనల్లో భాగంగా ఏర్పాటు చేసేవారు. ఈ జూలను సందర్శించటానికి జనం తండోపతండాలుగా వచ్చేవారు.
