కేవలం రూ.55 పెట్టుబడి పెట్టి చాలు నెలకు రూ.3,000.. అద్భుతమైన స్కీమ్‌

June 04, 2026

Subhash

దేశంలో చిన్న వ్యాపారులు, కూలీలు, రిక్షా కార్మికులకు 60 ఏళ్లు దాటాక ఇల్లు గడవడం పెద్ద ఆందోళన. ఇలాంటి అసంఘటిత రంగ కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం 'పీఎం శ్రమ్ యోగి మాంధన్' పథకాన్ని అందిస్తోంది.

పెన్షన్‌

వీధి వ్యాపారులు, రిక్షా కార్మికులు, నిర్మాణ కూలీలు, గృహ కార్మికులు, వ్యవసాయ కూలీలు, చేనేత కార్మికులు మరియు చిన్న దుకాణదారులు వంటి తక్కువ ఆదాయం ఉన్న అసంఘటిత రంగ కార్మికుల కోసం.

లబ్ధిదారులు ఎవరు?

వయస్సు: 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. నెలవారీ ఆదాయం: రూ. 15,000 లేదా అంతకంటే తక్కువ ఉండాలి. ఆదాయపు పన్ను చెల్లింపుదారులు కాకూడదు.

అర్హత ప్రమాణాలు

దరఖాస్తుదారులు EPFO (Provident Fund), ESIC లేదా నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) వంటి ఇతర ప్రభుత్వ సామాజిక భద్రతా పథకాలలో సభ్యులుగా ఉండకూడదు.

ఇతర నిబంధనలు

మీ వయస్సు ఆధారంగా ప్రీమియం ఉంటుంది. 18 ఏళ్లు చేరితే నెలకు రూ. 55, అదే 40 ఏళ్లలో  చేరితే నెలకు రూ. 200 కట్టాలి. మీరు ఎంత కడితే, ప్రభుత్వం అంతే మొత్తాన్ని జత చేస్తుంది.

నెలవారీ ప్రీమియం

మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్‌కి వెళ్లి ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ వివరాలతో నమోదు చేసుకోవచ్చు. ఆటో-డెబిట్ ఆప్షన్ పెట్టుకుంటే ప్రతి నెలా కట్ అవుతుంది.

దరఖాస్తు విధానం

లబ్ధిదారునికి 60 ఏళ్లు నిండిన తర్వాత ప్రతి నెలా రూ. 3,000 ఖచ్చితమైన పింఛను అందుతుంది. ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరూ విడివిడిగా ఈ పథకంలో చేరితే, ఆ కుటుంబానికి నెలకు రూ. 6,000 వరకు లభిస్తుంది.

లభించే పింఛను

పింఛను పొందుతున్న సమయంలో లబ్ధిదారుడు మరణిస్తే, వారి జీవిత భాగస్వామికి (భార్య/భర్త) 50% కుటుంబ పింఛను అందుతుంది. అంటే జీవిత భాగస్వామికి ప్రతి నెలా రూ. 1,500 లభిస్తాయి.

లబ్ధిదారుడు మరణిస్తే?