Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: కోవిడ్ బారి నుంచి తప్పించుకునేందుకు ఇలా కూడా చేస్తారా..? మీకు దండేసి దణ్ణం పెట్టాలి సామీ

ప్రపంచ దేశాలలో కూడా గత పది రోజుల నుంచి కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రజలంతా కరోనాపై పోరాడేందుకు మరోసారి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే చైనాకు చెందిన ఓ జంట కరోనా నుంచి తమను తాము..

Watch Video: కోవిడ్ బారి నుంచి తప్పించుకునేందుకు ఇలా కూడా చేస్తారా..? మీకు దండేసి దణ్ణం పెట్టాలి సామీ
China Couple Wearing Plastic Cover Amid Covid19 Cases
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 26, 2022 | 7:32 PM

ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో కోవిడ్ 19 సబ్ వేరియంట్ బీఎఫ్17 గురించి ఇప్పుడు ఒక్కటే చర్చ. ఈ వేరియంట్‌కు సంబంధించిన కేసులు చైనాలో వేగవంతంగా వ్యాపించడమే ఇందుకు ప్రధాన కారణం. అంతేకాకుండా అమెరికా, జపాన్, బ్రెజిల్ వంటి ఇతర దేశాలలో కూడా గత పది రోజుల నుంచి కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రజలంతా కరోనాపై పోరాడేందుకు మరోసారి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే చైనాకు చెందిన ఓ జంట కరోనా నుంచి తమను తాము కాపాడుకునేందుకు వినూత్న స్థాయిలో ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వారు మాస్క్ ధరించారు. మాస్క్ ధరించడంలో విశేషమేముందని అనకుంటున్నారా..? విషయం అది కానే కాదు. వారు మాస్క్‌ను ధరించడమే కాక వారి మీద ఓ ప్లాస్టిక్ కవర్‌ను కూడా ఉంది. చూడడానికి అచ్చం గొడుగులాగానే ఉన్న ఈ ప్లాస్టిక్ కవర్ వారి పై నుంచి పాదాల వరకు ఉంది.

పీపుల్స్ డైలీ అనే చైనా ప్రభుత్వానుబంధ మీడియా నుంచి పోస్ట్ అయిన ఈ వీడియోకు ఇప్పటి వరకు 70 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇక ఈ వీడియోలో ఆ జంట మార్కెట్‌కు వెళ్లినట్లున్నారు. అక్కడ షాపింగ్ చేస్తున్నప్పుడు కొనుగోలు చేసిన వాటిని వారు షీట్ కిందిగా తీసుకోవడాన్ని మనం చూడవచ్చు. చైనాలో ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఈ జంట చేసిన వినూత్న ప్రయత్నం, పాటిస్తున్న జాగ్రత్తను చూపి అక్కడివారంతా షాకయ్యారు. ఇక బీఎఫ్7 సబ్ వేరియంట్ చైనాలో నమోదుకాకముందే భారత్‌తో సహా 91 దేశాల్లో వెలుగులోకి వచ్చిందని పలువురు ఆరోగ్యనిపుణులు అంటున్నారు. అయితే, ప్రస్తుతం ఉన్నంత గణనీయమైన పెరుగుదల అప్పట్లో లేకపోయింది.

ఇవి కూడా చదవండి

నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..

కాగా, వైరల్ అవుతున్న వీడియోను చూడడానికి నెటిజన్లు ఇష్టపడుతున్నారు. అంతేకాక చైనాకు చెందిన ఆ జంటను ప్రశంసిస్తున్నారు. ‘‘వారు ధరించిన ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యేక స్లీవ్/ఆర్మ్ అటాచ్‌మెంట్ ఉండాలి. తద్వారా వారు దానిని పూర్తిగా ఎత్తాల్సిన అవసరం ఉండద’’ని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. మరో నెటిజన్ ‘చాలా బాగుంది కొత్త ఐడియా.. ఇలా చేస్తే కరోనా సోకదు’ అని రాసుకొచ్చాడు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ పరీక్షలను పెంచాలని భారత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది. మాస్క్‌లు ధరించాలని, కోవిడ్‌ నిబంధనలను పాటించాలని ఆరోగ్య నిపుణులు కూడా ప్రజలకు సూచించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం