Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Metro: భాగ్యనగర మెట్రో ప్రయాణికులకు గమనిక.. త్వరలో పెరగనున్న టికెట్ ధరలు.. పూర్తి వివరాలివే..

రానున్న కాలంలో హైదరాబాద్ మెట్రో రైలు టికెట్‌ ధరలు పెరగనున్నాయని సంబంధిత వర్గాలు అంటున్నాయి. మెట్రో నిర్వహణ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఉన్నతాధికారుల సూచన మేరకు టికెట్‌ ధరలను..

Hyderabad Metro: భాగ్యనగర మెట్రో ప్రయాణికులకు గమనిక.. త్వరలో పెరగనున్న టికెట్ ధరలు.. పూర్తి వివరాలివే..
Hyderabad Metro
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 27, 2022 | 3:29 PM

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ మహా నగరంలో మెట్రో ప్రయాణం అంటే ఒక తీయని అనుభూతి. అంతేకాక నగరంలో వేగవంతమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తున్న మెట్రో రైళ్లు రోజురోజుకూ పుంజుకుంటున్నాయి. అందుబాటులో ఉన్న ధరలు, సమయానికి ఏదో ఒక రైలు ప్లాట్ ఫామ్‌కు వస్తుండడంతో.. హలీడే వచ్చిందంటే చాలు నగరవాసులంతా మెట్రో రైళ్ల ప్రయాణంతో సందడి చేస్తుంటారు. కానీ రానున్న కాలంలో హైదరాబాద్ మెట్రో రైలు టికెట్‌ ధరలు పెరగనున్నాయని సంబంధిత వర్గాలు అంటున్నాయి. మెట్రో నిర్వహణ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఉన్నతాధికారుల సూచన మేరకు టికెట్‌ ధరలను పెంచేందుకు లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్‌అండ్‌టీ) సంస్థ సిద్ధమవుతోంది. జనవరి నుంచే కొత్త రేట్లను అమల్లోకి తీసుకురావాలని భావిస్తోంది. కొవిడ్‌తో రెండేళ్లపాటు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఎల్‌అండ్‌టీ ఇటీవల కాలంలో కొంత ఊరట చెందుతోంది. మూడు లైన్ల ద్వారా  రోజుకు 4.20 లక్షల నుంచి 4.50 లక్షల మంది వరకు రాకపోకలు సాగిస్తుండడంతో..  ఉదయం, రాత్రి వేళల్లో ఎప్పుడు చూసినా మెట్రో రెళ్లలో రద్దీ కనిపిస్తోంది. ఈ క్రమంలో టీకెట్ ధరలలో మార్పులు పూర్తయితే ప్రస్తుతం రూ.10గా ఉన్న ప్రారంభ టికెట్‌ ధర రూ.20కి, రూ.60గా ఉన్న గరిష్ఠ ధర రూ.80కి చేరే అవకాశం ఉంది.

టికెట్‌ రేట్ల మార్పుల కోసం కసరత్తు

మైట్రో నిర్వాహణాధికారులు 2 కిలోమీటర్ల దూరానికి టికెట్‌ ధర ప్రస్తుతం రూ.10. అలాగే 2-4 కి.మీ.కు రూ.15, 4-6 కి.మీ. దూరానికి రూ.25, 6-8 కి.మీ.కు రూ.30, 8-10 కి.మీ.కు రూ.35, 10-14 కి.మీ.కు రూ.40, 14-18 కి.మీ.కు రూ.45, 18-22 కి.మీ.కు రూ.50, 22-26 కి.మీ.కు రూ.55, 26 కిలోమీటర్లకు పైగా దూరానికి రూ.60లను టికెట్ ధరగా తీసుకుంటున్నారు ఎల్ అండ్ టీ అధికారులు. టికెట్‌ రేట్ల సవరణకు సంబంధించి హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్రం 2 నెలల క్రితం ‘ధరల నిర్ధారణ కమిటీ’ని నియమించింది. రిటైర్డ్‌ హైకోర్టు న్యాయమూర్తి శ్యాంప్రసాద్‌ చైర్మన్‌గా, కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి సురేంద్రకుమార్‌ బగ్దె, రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్‌కుమార్‌ కమిటీ సభ్యులుగా ఉన్నారు. నవంబరులో సమావేశమైన కమిటీ సభ్యులు చార్జీల సవరణకు సంబంధించి తమ అభిప్రాయాలు, సలహాలు, సూచనలను అదే నెల 15 వరకు తెలపాలని బహిరంగంగా ప్రజలను కోరారు. దీంతో వందలాది మంది తమ అభిప్రాయాలను మెయిల్స్‌ ద్వారా పంపించినట్లు తెలిసింది.

కాగా, కమిటీ ఇచ్చిన గడువు ముగియడంతో టికెట్‌ రేట్ల సవరణకు సంబంధించి క్షేత్రస్థాయి పరిస్థితులను స్వతంత్ర సంస్థతో అధ్యయనం చేయిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే హైదరాబాద్‌ ఇచ్చిన చార్జీల పెంపు ప్రతిపాదనలను ఎల్‌అండ్‌టీ సంస్థ పరిశీలించడంతోపాటు ఆ స్థాయిలో రేట్లు ఉంటే మెట్రో ప్రయాణికులపై ఎంత భారం పడుతుంది..? చార్జీలు పెరగినందున రాకపోకలు తగ్గుతాయా? అనే అంశాలపై క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఇప్పుడు టికెట్‌ రేట్లు పెంచితే మరో ఐదేళ్ల వరకు పెంచే అవకాశం ఉండదని.. కొవిడ్‌ నష్టాలను పరిగణనలోకి తీసుకొని రేట్ల పెంపు విషయంలో సహకరించాలని హెచ్‌ఎంఆర్‌, ఎల్‌అండ్‌టీ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. పెంపు ప్రక్రియను మూడు నెలల్లోపు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!