Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Gandhi: గడ్డకట్టించే చలిలోనూ టీషర్ట్ ధరించి ప్రముఖులకు నివాళులర్పించిన కాంగ్రెస్ అధినేత.. మీమ్స్ వర్షం కురిపిస్తున్న నెటిజన్లు..

జోడో యాత్ర ఢిల్లీ చేరిన మరుసటి రోజే(ఆదివారం) దేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయ్ జయంతి కావడంతో రాహుల్ గాంధీ ఆయనకు నివాళులర్పించారు. ఆ క్రమంలోనే సోమవారం మహాత్మా..

Rahul Gandhi: గడ్డకట్టించే చలిలోనూ టీషర్ట్ ధరించి ప్రముఖులకు నివాళులర్పించిన కాంగ్రెస్ అధినేత.. మీమ్స్ వర్షం కురిపిస్తున్న నెటిజన్లు..
Rahul Gandhi Expessing Tributes To Freedom Fighter In 9 Degree Celsius Temparature
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 26, 2022 | 10:12 PM

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నేతృత్వంలో సాగుతున్న భారత్ జోడో యాత్ర డిసెంబర్ 24న ఢిల్లీలో ప్రవేశించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం కల్పించాలనే సంకల్పంతో సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర దాదాపు 3,000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. క్రిస్మస్, నూతన సంవత్సరం నేపథ్యంలో యాత్రకు కొన్ని రోజుల పాటు విరామం పలికి, తిరిగి 2023 జనవరిలో ప్రారంభించాలని రాహుల్ నిర్ణయించారు. జోడో యాత్ర ఢిల్లీ చేరిన మరుసటి రోజే(ఆదివారం) దేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయ్ జయంతి కావడంతో రాహుల్ గాంధీ ఆయనకు నివాళులర్పించారు. ఆ క్రమంలోనే సోమవారం మహాత్మా గాంధీ తదితర ప్రముఖులకు, మాజీ ప్రధానులకు రాహుల్ గాంధీ నివాళులర్పించారు.

అయితే నివాళులర్పిస్తున్న సమయంలో రాహుల్ గాంధీ టీ షర్ట్‌లో ఉన్నారు. 8-9 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉన్న ఢిల్లీలో.. టీ షర్ట్ ధరించి నడుస్తున్న రాహుల్ గాంధీ ఫోటోలను కాంగ్రెస్ నేతలు పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో అవి వైరల్ అవుతున్నాయి. ఇక నెటిజన్లు తమ ఆశ్చర్యాన్ని వారి కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ‘‘ఢిల్లీలో ఉదయం ఉష్ణోగ్రత 9 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.. టీ షర్ట్‌లోనే నడుస్తున్నారా? ఇంతటి ఎనర్జీ ఎక్కడ నుంచి పొందుతారు రాహుల్ గాంధీ భయ్యా..’’ కామెంట్ చేశాడు.

“ఈయనకు ఎందుకు చలి అనిపించడం లేదు? అందరూ కోటు, జాకెట్‌లో ఉన్నారు. కానీ ఈయన హాఫ్ టీ-షర్ట్‌లో కనిపిస్తున్నారు. ఈరోజు ఢిల్లీలో చలి వణికిస్తోంది. #RahulGandhi #BharatJodaYatra’’ అని జర్నలిస్ట్ అజిత్ అంజుమ్ హిందీలో ట్వీట్ చేశారు.

ఇలా నెటిజన్లు, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు వారికి నచ్చిని విధంగా కామెంట్ చేస్తుండగా వారిలో కొందరు రాహుల్ గాంధీని మంచు పర్వతాలలోని సన్యాసులతో పోల్చారు. “చాలా మంది రాహుల్ గాంధీ ధరించిన టీ-షర్ట్‌ గురించే మాట్లాడుతున్నారు. ఇంతటి మానసిక, శారీరక, భావోద్వేగ, ఆధ్యాత్మిక దృఢత్వం.. శక్తి. ధ్యానం కారణంగానే లభిస్తాయ’’ని తహసీన్ పూనావాలా ట్వీట్ చేశారు. ఇలా నెటిజన్లు వారి వారి స్పందనలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.