AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Care: నిగారించే శిరోజాలు కావాలా? అయితే ఆన్ లైన్ లో దొరికే బెస్ట్ హెర్బల్ ప్రోడక్ట్స్ మీకోసం.. ఓ లుక్కేయండి

అయితే కాలుష్యం, రోజూ వారి సంరక్షణ సక్రమంగా లేకపోవడంతో కొందరి జుట్టు నిగారింపు కోల్పోతుంది. పలుచగా మారిపోయి ఊడిపోతోంది. లేదంటే చుండ్రు సమస్య చుట్టుముడుతుంది. వీటిన్నంటి నుంచి మీ జుట్టుని సంరక్షించుకోవడానికి..

Hair Care: నిగారించే శిరోజాలు కావాలా? అయితే ఆన్ లైన్ లో దొరికే బెస్ట్ హెర్బల్ ప్రోడక్ట్స్ మీకోసం.. ఓ లుక్కేయండి
Methi Powder
Madhu
| Edited By: Anil kumar poka|

Updated on: Dec 27, 2022 | 4:59 PM

Share

మగువలకు శిరోజాలే అందం.. నల్లగా ఒత్తుగా ఉండే జుత్తును ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. అందుకే కేశాల ఆరోగ్యానికి మహిళలు చాలా ప్రాధాన్యం ఇస్తారు. వాటిని ఆరోగ్యంగా , ఆకర్షణీయంగా ఉంచుకోడానికి ఇష్టపడతారు. ప్రపంచంలోనే భారతీయ మహిళల జుట్టుకు మంచి గుర్తింపు ఉంది. ఇక్కడి మహిళల్లో ఉండేంత ఆరోగ్య కర కేశాలు మరెక్కడా ఉండవట. అయితే కాలుష్యం, రోజూ వారి సంరక్షణ సక్రమంగా లేకపోవడంతో కొందరి జుట్టు నిగారింపు కోల్పోతుంది. పలుచగా మారిపోయి ఊడిపోతోంది. లేదంటే చుండ్రు సమస్య చుట్టుముడుతుంది. వీటిన్నంటి నుంచి మీ జుట్టుని సంరక్షించుకోవడానికి కొంతమంది ఇంటి చిట్కాలు ఫాలో అవుతారు. మరికొందరూ కొన్ని రకాల చికిత్సా విధానాలను అవలంభిస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది ఆన్ లైన్ లో కూడా ఆరోగ్యకర శిరోజాలకు మంచి చికిత్సా విధానాలపై వెతుకుతున్నారు. మీరు కూడా అలాగే చేశారా అయితే ఈ కథనం మీ కోసమే.

మెంతి పొడి అద్భుత పరిష్కారం..

నిపుణుల అభిప్రాయం ప్రకారం మెంతి పొడి శిరోజాల ఆరోగ్యానికి బాగా ఉపయోడుతుంది. చుండ్రు సమస్యను, జుట్టు పల్చబడడాన్ని తగ్గిస్తుంది. ఇది రోజూ వాడితే జట్టు సిల్కీగా, మృదువుగా మారుతుంది. మెంతి గింజల్లో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు, ఇతర సింథటిక్ ఔషధాల వలె దుష్ప్రభావాలు లేకుండా చుండ్రుకు కారణమయ్యే బ్యాక్టీరియాను సమర్థవంతంగా ఎదుర్కొంటాయి. అలాగే పెద్ద మొత్తంలో లినోలెయిక్ , ఒలేయిక్ కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి, ఇవి చర్మ సంరక్షణ ఉత్పత్తులలో తరచుగా కనిపిస్తాయి. ఈ నేపథ్యంలో ఆన్ లైన్ లో అత్యధికంగా అమ్ముడయ్యే మెంతి పౌడర్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఇండస్ వ్యాలీ బయో ఆర్గానిక్ మెంతి పొడి

సేంద్రియ పద్ధతిలో ఉత్పత్తి చేయబడిన మెంతి విత్తనాలను చూర్ణం చేసి సింధూ వ్యాలీ బయో-ఆర్గానిక్ మెంతి గింజల పొడిని తయారు చేస్తారు. ఈ ఆర్గానిక్ పౌడర్ 100 శాతం స్వచ్ఛమైనది. ఇది మీ చర్మ ఛాయను ప్రకాశవంతం చేయడానికి, జుట్టు రాలడాన్ని ఆపడానికి ఉపయోగపడుతుంది. అంతేకాక రక్తంలో ని చక్కెర స్థాయిలను అదుపు చేయడంతో పాటు పేగులను శుభ్రపరచుతుంది.

ఇవి కూడా చదవండి

IYUSH హెర్బల్ ఆయుర్వేద ఆర్గానిక్ మేతి పౌడర్

అనువైన కీళ్ల కదలిక లేదా స్కాల్ప్ సంబంధిత సమస్యల కోసం Iyush ద్వారా ఈ హెర్బల్ మెంతి పొడిని వినియోగిస్తారు. మెంతి గింజలలో ఉండే ఐరన్, ప్రొటీన్, జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ లక్షణాల వల్ల జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

అత్తర్ ఆయుర్వేద మేతి సీడ్ పౌడర్

అత్తర్ ఆయుర్వేదంలోని మేతి పౌడర్ సహజమైన యాంటీ ఏజింగ్ సొల్యూషన్‌గా పనిచేస్తుంది. ఇది మీ జుట్టుకు సంబంధించిన అన్ని సమస్యలకు సరైన పరిష్కారం. అధిక నియాసిన్ లేదా విటమిన్ B3 కంటెంట్ కారణంగా ఇప్పటికే దెబ్బతిన్న చర్మ కణాలను సమర్థవంతంగా నయం చేయగలుగుతుంది. ఫలితంగా ముడతలు, వయస్సు మచ్చలను తొలగిస్తుంది. అలాగే చండ్రు సమస్యలను నివారించడంతో పాటు జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుంది.

జైన్ మేతి (ఫెనుగ్రీక్) పౌడర్

జైన్ మేతి పౌడర్ మీ జుట్టుకు మాత్రమే కాకుండా రక్తహీనత, చనుబాలివ్వడం, మధుమేహం, జీర్ణక్రియ వంటి అనేక ఇతర సమస్యలకు కూడా ఉపయోగపడుతుంది. జుట్టు రాలడం, చుండ్రు లేదా దురద, పొడి చర్మంతో సహా ఇతర సంబంధిత సమస్యలకు ఇది సహజ నివారిణిగా పనిచేస్తుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు మొటిమలు, నెత్తిమీద దద్దుర్లు చుండ్రు రాకుండా సహాయపడతాయి.

బంజారాస్ మేతి హెయిర్ కేర్ పౌడర్

బంజారాస్ మేతి హెయిర్ కేర్ పౌడర్ వివిధ రకాల జుట్టు, స్కాల్ప్ సమస్యలకు వన్-స్టాప్ పరిష్కారం. ఇది మూలాల నుంచి జుట్టును బలపరుస్తుంది. జుట్టును మృదువుగా, సిల్కీగా చేస్తుంది. లోపలి నుంచి తలకు పోషణనిచ్చి నిగారించేలా చేస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్  చేయండి..