Heavy Weight: రాత్రి వేళ వీటిని తింటే కొండలా తయారవుతారు.. తస్మాత్ జాగ్రత్త..
Cholesterol: ఆరోగ్యానికి అదిపెద్ద సవాల్ కొలెస్ట్రాల్. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే.. అది యమలోకానికి దారులు వేస్తుంటుంది. కొలెస్ట్రాల్ నియంత్రణ చాలా కష్టం కూడా.
ఆరోగ్యానికి అదిపెద్ద సవాల్ కొలెస్ట్రాల్. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే.. అది యమలోకానికి దారులు వేస్తుంటుంది. కొలెస్ట్రాల్ నియంత్రణ చాలా కష్టం కూడా. దీని వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇక కొన్ని రకాల ఆహారాలు మన శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుదలకు కారణం అవుతాయి. ముఖ్యంగా రాత్రిపూట వీటిని తినడం వలన శరీరంలో కొలెస్ట్రాల్ వేగంగా పెరుగుతుంది. ఎందుకంటే.. రాత్రి తిన్న తరువాత నిద్రపోతాం. శారీరక శ్రమ ఉండదు. ఫలితంగా తిన్న ఆహారం కొలెస్ట్రాల్‌గా మారి.. మరింత బరువు పెరుగుదలకు కారణం అవుతుంది. మరి రాత్రిపూట తినడం వలన కొలెస్ట్రాల్ పెరుగుదలకు కారణమయ్యే పదార్థాలేంటి? వేటిని తినకూడదు? వంటి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఫాస్ట్‌ఫుడ్..
ఫాస్ట్‌ఫుడ్ గుండకు చాలా హానీకరం. ఇది కొలెస్ట్రాల్‌ను వేగంగా పెంచుతుంది. ముఖ్యంగా రాత్రిపూట ఫాస్ట్ ఫుడ్ తినడం మానుకోవాలి. పిజ్జా, పాస్తా, బర్గర్లు, నూడుల్స్ వంటి ఫాస్ట్ ఫుడ్స్ రాత్రి వేళల్లో అస్సలు తినొద్దు. ఇవి ఆరోగ్యానికి చాలా హానీకరం.
చీజ్..
ప్రస్తుత కాలంలో చాలామంది చీజ్ తింటున్నారు. చీజ్ లేకుండా పిజ్జా, బర్గర్, పాస్తా వంటి ఫాస్ట్ ఫుడ్ తినడానికి ఎవరూ ఇష్టపడటం లేదు. చీజ్‌లో ప్రోటీన్ ఉంటుంది. కానీ, దీనిని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానీకరం. ఇందులో గుండెకు హానీ కలిగించే కొవ్వు అధికశాతం ఉంటుంది. అందుకే చీజ్‌ను అధికంగా తీసుకోవద్దు.
స్పైసీ, ఆయిల్ ఫుడ్..
రాత్రిపూట స్పైసీ, ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. నూనెలో సంతృప్త కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇది త్వరగా కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. సంతృప్త కొవ్వు ధమనులలో పేరుకుపోతుంది. ఇది రక్త ప్రసరణను చాలా ప్రభావితం చేస్తుంది.
స్వీట్లు..
రాత్రిపూట స్వీట్లు తినొద్దు. స్వీట్లు తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్, కొలెస్ట్రాల్ లెవల్స్ పెరుగుతాయి. అందుకే రాత్రిపూట స్వీట్లతో పాటు, టీ, కాఫీలకు, కేకులు, స్వీట్లు, శీతల పానీయాలు తీసుకోవద్దు. వీటి వల్ల గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..