Brahma Temple: దురదృష్టం వెంటాడుతుందా.. ఈ క్షేత్రంలోని తీర్ధంలో స్నానం చేసి.. శివ బ్రహ్మలను పూజిస్తే.. అదృష్టం మీ వెంటే..

సనాతన హిందూ ధర్మంలో కర్మసిద్దాంతాన్ని నమ్ముతారు. పుట్టింది మొదలు.. చదువు, ఉద్యోగం పెళ్లి, జీవితంలో జరిగే ప్రతి సంఘటన కర్మ ఆధారంగానే జరుగుందని విశ్వాసం. బ్రహ్మ నుదిటి రాసిన రాతను ఎవరూ మార్చలేరని.. ప్రభావం మాత్రమే తగ్గించుకోవచ్చంటూ అనేక పరిహారాలు చేస్తారు. దేవాలయాల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయితే ప్రపంచంలో ఒకే ఒక దేవాలయం మన తలరాతను మారుస్తుందని.. ఇక్కడ దైవాన్ని దర్శించుకొంటే తల రాత మారి.. దురదష్టం.. అదృష్టంగా మారుతుందని చెబుతారు. ఇంతకూ ఆ దేవాలయం ఎక్కడ ఉందో తెలుసుకుందాం..

Surya Kala

|

Updated on: Dec 26, 2022 | 9:56 PM

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తులు.. సృష్టి, స్థితి, లయకారులు. మనల్ని సృష్టించిన బ్రహ్మకు భూ లోకంలో ఆలయాలు లేకుండా శివయ్య శపించాడు. అయితే శివ పార్వతులతో పాటు... బ్రహ్మ దేవుడు కూడా పూజలను అందుకుంటున్న క్షేత్రం ఒకటి ఉంది. తమిళనాడులోని తిరుచ్చి సమీపంలోని తిరుపత్తూరులో బ్రహ్మపురీశ్వర దేవాలయం.

1 / 10
బ్రహ్మే ఈశ్వరుని పూజించినాడు కనుక బ్రహ్మపురేశ్వర ఆలయం అని పేరు వచ్చింది. మన తలరాతను మార్చే దేవుడిగా.. అంటే మన జీవితంలో మంచిని తెచ్చే ఆలయంగా బ్రహ్మ దేవుడి ఆలయం ప్రసిధ్ధి చెందింది. ఆ బ్రహ్మదేవుని అనుగ్రహం ఉంటే జీవితంలో ఎటువంటి కష్టాలు అయినా తొలగిపోయి.. మంచి జరుగుతుంది అని భక్తుల నమ్మకం.

2 / 10
విష్ణు నాభి నుంచి పుట్టిన బ్రహ్మ దేవుడికి ఈ సృష్టికి మూలం తానే అని గర్వపడుతుంటాడు. అప్పుడు పరమ శివుడి యొక్క ప్రతిరూపంగా భావించే కాలభైరవుడు బ్రహ్మదేవుడి యొక్క 5 వ తలని ఖండించాడు. అంతేకాదు శివుడు బ్రహ్మదేవుడు తన సృష్టి నిర్మాణ శక్తిని కోల్పోవాలని శపిస్తాడు.

3 / 10
దీంతో బ్రహ్మ దేవుడు తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో శాప విముక్తి కోసం ఈ ప్రాంతంలో పరమ శివుడి 12 లింగాలను ప్రతిష్టించి శివుడిని ప్రార్ధించాడు. అందుకనే ఆ ఊరిని బ్రహ్మపురి అని పిలుస్తారు. బ్రహ్మ తీర్థం చుట్టూ ఉన్నాయి. శివుడికి పూజలు చేయటానికి బ్రహ్మ దేవుడు నీరు తీసుకున్న చెరువుని బ్రహ్మ తీర్థంగా పిలుస్తున్నారు. ఈ తీర్థం దగ్గరే బ్రహ్మ దేవుడు శివుడిని ప్రార్ధించాడని విశ్వసిస్తారు.

4 / 10
బ్రహ్మ తన తలరాతని తానే మార్చుకున్న ప్రాంతం కనుక ఇక్కడ బ్రహ్మదేవుడిని అతను ప్రతిష్టించిన 12 శివలింగాలను దర్శించిన వారి రాత మారుతుంది అని..దురదృష్టం తొలగి.. అదృష్ట వంతులుగా మారతారని విశ్వాసం. ఈ దేవాలయ ప్రాంగణంలో పతంజలి మహర్షి జీవ సమాధి కూడా ప్రసిద్ధిగాంచింది.

5 / 10
బ్రహ్మ పశ్చాత్తాపాన్ని గ్రహించిన పార్వతీపరమేశ్వరులు బ్రహ్మ దేవుడికి శాప విమోచనం కలిగించి తిరిగి సృష్టి నిర్మాణ శక్తిని ఇచ్చారు. కనుక నే ఈ బ్రహ్మ పురిలో బ్రహ్మదేవుడికి ఒక ప్రత్యేకమైన ఆలయం కూడా ఉంది.

6 / 10
తమ జీవితంలో తాము అనుకున్నది సాధించలేక పోయినప్పుడు.. దురదృష్టం వెంటాడుతున్నప్పుడు ఈ బ్రహ్మదేవుడి ని దర్శించుకొంటారు.. తమ కష్టాలను తొలగించుకొంటారు.

7 / 10
ప్రతి ఏడాది తమిళ పంగునీ మాసంలో మూడు రోజుల పాటు సూర్య కిరణాలు.. ఏడు ద్వారాలను దాటి గర్బగుడిలోకి ప్రవేశించి నేరుగా  బ్రహ్మను నేరుగా తాకుతాయి.

8 / 10

 6 అడుగుల బ్రహ్మ విగ్రహం ఎల్లప్పుడూ కుంకుమతో అలంకరణ చేసి ఉండటం విశేషం. ఇక్కడ సోమవారం, గురువారం ప్రత్యేక పూజలు జరుగుతాయి.

9 / 10
 బ్రహ్మ ఆశీర్వాదం పొంది తమ తలరాతను మార్చుకోవడానికి ఈ ఆలయానికి అనేక ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వస్తారు.

10 / 10
Follow us