Dieting Mistakes: డైటింగ్ చేస్తున్నా బరువు తగ్గట్లేదా? ఈ తప్పులు చేస్తున్నారేమో? ఓ లుక్కెయ్యండి

ఊబకాయం వయస్సుతో సంబంధం లేకుండా అందరినీ ఇబ్బంది పెడుతున్న పెద్ద సమస్య. ఊబకాయం నుంచి రక్షణకు అంతా డైటింగ్ చేస్తుంటారు

Dieting Mistakes: డైటింగ్ చేస్తున్నా బరువు తగ్గట్లేదా? ఈ తప్పులు చేస్తున్నారేమో? ఓ లుక్కెయ్యండి
Weight Loss
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Dec 27, 2022 | 4:46 PM

ఊబకాయం వయస్సుతో సంబంధం లేకుండా అందరినీ ఇబ్బంది పెడుతున్న పెద్ద సమస్య. ఊబకాయం నుంచి రక్షణకు అంతా డైటింగ్ చేస్తుంటారు. ఆహార నియమాలు, జీవన శైలిలో మార్పులు చేసుకుంటూ ఊబకాయ సమస్య నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే కొంత మంది మాత్రం ఎంత డైటింగ్ చేసినా ఎలాంటి ఫలితం ఉండడం లేదని బాధపడుతుంటారు. అలాంటి వారు డైటింగ్ లో కొన్ని తప్పులు చేయడం వల్లే ఊబకాయం నుంచి బయటపడడం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. డైటింగ్ చేయడం ఎంత ముఖ్యమో? ఎలా చేస్తున్నామో? అనే విషయం కూడా అంతే ముఖ్యమని పేర్కొంటున్నారు. డైటింగ్ తో పాటు నిద్ర కూడా అవసరమని వివరిస్తున్నారు. డైటింగ్ విషయంలో చేసే తప్పులేంటో సారి తెలుసుకుందాం.

క్యాలరీలను తప్పుగా కొలవడం

బరువు తగ్గడానికి అధిక క్యాలరీలను కరిగించాలి. కానీ కరిగించే క్యాలరీలను తప్పుగా కొలుస్తున్నామా? అనే అనుమానం మీకు వచ్చిందా? అవును అధిక క్యాలరీలను కరిగించే నెపంతో మరీ తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే ఆకలితో మరింత ఎక్కువగా తినే అవకాశం ఉందని నిపుణుల భావన

వీకెండ్స్ లో ఎక్కువ తినడం

మనం డైటింగ్ లో ఉన్నప్పుడు ప్రతిరోజు నిర్ధిష్ట ఆహార నియమాలను పాటిస్తాం. అయితే వారాంతంలో ఎలాంటి నియమాలు పాటించకుండా నచ్చింది తినడానికి ఇష్టపడుతుంటాం. అయితే ఇది చాలా తప్పని, వారాంతంలో కూడా డైట్ చార్ట్ ను ఫాలో అవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. డైట్ చార్ట్ లేకపోతే ప్రిపేర్ చేసుకోవాలని వివరిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

టిఫిన్ తినకపోవడం

డైట్ లో ఉన్న వారు క్యాలరీలను బర్న్ చేయడానికి సింపుల్ టిఫిన్ ను స్కిప్ చేసేస్తుంటారు. డైరెక్ట్ గా మధ్యాహ్నం భోజనం చేస్తారు. టిఫిన్ తినకవపోడం వల్ల ఆకలితో మధ్యాహ్నం భోజనం ఎక్కువ తినేస్తామని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డైటింగ్ ఉన్న వారు కచ్చితంగా టిఫిన్ తినాలని సూచిస్తున్నారు. 

అధిక మద్యపానం

అతి ఎప్పటికి అనర్థమే అని గుర్తు పెట్టుకోవాలి. డైటింగ్ లో ఉన్న వారు అధికంగా మద్యపానం తీసుకున్నా అది  బరువు తగ్గడంపై ప్రభావం చూపిస్తుంది. అలాగే మద్యపానం ఆరోగ్యానికి హానికరం వీలైనంతగా మద్యపానానికి దూరంగా ఉండాలి. 

పానియాలు అధికంగా తాగడం

సాధారణంగా మనం క్యాలరీలను కొలిచే సమయంలో పానియాల వల్ల వచ్చే క్యాలరీలను పట్టించుకోము. పండ్ల రసాలు, సోడాల్లో కూడా క్యాలరీలు ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఈ అధిక క్యాలరీల వల్ల మన డైట్ చార్ట్ డిస్ట్రబ్ అవుతుంది. 

తక్కువ కొవ్వు ఉన్న ఆహారాన్ని ఎంచుకోవడం

తక్కువ కొవ్వు ఉన్న ఆహారాన్ని డైటింగ్ చేసే వాళ్లు ప్రిఫర్ చేస్తారు. అయితే అలాంటి వాళ్లు పోషకమైన, కనిష్టంగా ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకోవడం ఉత్తమం. వీలైనంతా పండ్లు, కూరగాయలు తింటే మంచిది. ఎందుకంటే వీటిలో అధిక పోషకాలు ఉంటాయి. 

మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!