Telangana: నిజామాబాద్‌లో కిడ్నాప్ కలకలం.. సినిమా రేంజ్ షాకింగ్ సీన్‌తో బిత్తరపోయిన జనం..
Kidnap in Nizamabad: వచ్చారు.. కొట్టారు.. ఎత్తుకెళ్లారు.. సేమ్ టు సేమ్.. సినిమాల్లో ఎలా కిడ్నాప్ చేస్తారో అలాగే చేశారు. నిజామాబాద్ జిల్లా పాలిటెక్నిక్ గ్రౌండ్‌లో బుధవారం సినిమాటిక్ కిడ్నాప్ సంచలనం రేపింది.
Kidnap in Nizamabad: వచ్చారు.. కొట్టారు.. ఎత్తుకెళ్లారు.. సేమ్ టు సేమ్.. సినిమాల్లో ఎలా కిడ్నాప్ చేస్తారో అలాగే చేశారు. నిజామాబాద్ జిల్లా పాలిటెక్నిక్ గ్రౌండ్‌లో బుధవారం సినిమాటిక్ కిడ్నాప్ సంచలనం రేపింది. కారులో వచ్చిన ముగ్గురు యువకులు ఎవరు..? యువకుడ్ని ఎందుకు ఎత్తుకెళ్లారన్నది మిస్టరీగా మారింది. TS 29 C 6688 వైట్‌కలర్ కారులో ముగ్గురు యువకులు వచ్చారు. గ్రౌండ్‌లో ఉన్న ఓ వ్యక్తిపై మూకుమ్మడిగా దాడి చేశారు. ఆ తర్వాత అదే కారులో బలవంతంగా తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో కారు నెంబర్ ఆధారంగా డిటేయిల్స్ సేకరించారు.
TS 29 C 6688 నెంబర్ కారు బాగయ్య యాదవ్ పేరు మీద ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఉదయం బాగయ్య యాదవ్ అల్లుడు అఖిలేష్ యాదవ్ ఈ రోజు ఉదయం తీసుకెళ్లినట్టు పేర్కొంటున్నారు. కిడ్నాప్ అనంతరం కారు బోధన్ వైపు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు.
కిడ్నాప్ ఎందుకు చేశారు..? దాడి చేయాల్సిన అవసరం ఏముంది..? ప్రేమ వ్యవహారమే కారణమా? ఇంకేదైనా రీజన్ ఉందా అన్నది తేలాల్సి ఉంది. పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో ఆరాతీస్తున్నారు.
కారులో అఖిలేష్ గ్యాంగ్‌తో వచ్చి కిడ్నాప్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.. అయితే, కిడ్నాప్ అయింది ఎవరు అని పోలీసులు ఆరా తీస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..