PM Kisan Update: రైతులకు అలర్ట్.. పీఎం కిసాన్ 13వ విడత నగదు జమ అప్పుడేనట..! ఇలా చెక్ చేసుకోండి..

దేశంలో వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్ ) పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే

PM Kisan Update: రైతులకు అలర్ట్.. పీఎం కిసాన్ 13వ విడత నగదు జమ అప్పుడేనట..! ఇలా చెక్ చేసుకోండి..
PM Kisan
Follow us

|

Updated on: Dec 27, 2022 | 4:58 PM

PM Kisan 13th Installment Release Date 2023: దేశంలో వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్ ) పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ. 6,000 చొప్పున అందిస్తోంది. ఈ ఆరు వేల మొత్తాన్ని మూడు వాయిదాలలో రూ.2,000 చొప్పున జమ చేస్తూ వస్తోంది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఇప్పటివరకు 12వ విడతల్లో నగదు జమచేయగా.. త్వరలో 13వ విడత నగదు విడుదల చేయనుంది. ఈ క్రమంలో రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 13వ విడత నగదు ఎప్పుడు విడుదల అవుతాయోనన్న అధికారిక సమాచారం కోసం.. ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, మోడీ ప్రభుత్వం 13వ విడత నగదును డిసెంబర్ నెలలోనే విడుదల చేస్తుందని ఊహాగానాలు వ్యాపించాయి. కానీ దీనిపై మాత్రం కేంద్రం ఎలాంటి అధికారిక సమాచారాన్ని మాత్రం పంచుకోలేదు. 2023 నూతన సంవత్సరం సందర్భంగా లబ్ధిదారుల ఖాతాకు 13వ వాయిదాను జమ చేయొచ్చంటూ చెబుతున్నప్పటికీ.. ఫిబ్రవరి-మార్చి మధ్య విడుదల చేసే అవకాశం ఉందని పలు వార్త సంస్థలు పేర్కొన్నాయి.

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 13వ విడత – బ్యాలెన్స్‌ని తనిఖీ చేయడానికి ఇలా చేయండి..

  • ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి – https://pmkisan.gov.in/
  • హోమ్‌పేజీలో ఫార్మర్స్ కార్నర్ సెక్షన్‌పై క్లిక్‌ చేయండి..
  • ‘బెనిఫిషియరీ స్టేటస్’ పై క్లిక్‌ చేయండి.. ఇక్కడ, లబ్ధిదారుల దరఖాస్తు స్థితిని తనిఖీ చేయవచ్చు.
  • జాబితాలో రైతు పేరు, అతని బ్యాంకు ఖాతాకు జమ చేసిన మొత్తం వివరాలు ఉంటాయి.
  • ఇప్పుడు మీ ఆధార్ నంబర్ లేదా ఖాతా నంబర్ లేదా మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.
  • ఆపై ‘డేటా పొందండి’పై క్లిక్ చేయండి.

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేది కేంద్ర ప్రభుత్వ పథకం. దీనికి కేంద్రం 100 శాతం నిధులను అందిస్తుంది. ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు భూమిని కలిగి, లేదా యాజమాన్యం హక్కు కలిగి ఉన్న చిన్న, సన్నకారు రైతు కుటుంబాలకు మూడు వాయిదాలలో సంవత్సరానికి 6,000 లను జమ చేస్తుంది.

మొదటి విడత డిసెంబర్ 1 నుంచి మార్చి 31 మధ్య, రెండవది ఏప్రిల్ 1 నుంచి జూలై 31 మధ్య, మూడవది ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 మధ్య కేంద్రం జమచేస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి