Hyderabad Real Estate: గృహాల విక్రయాలలో తగ్గేదిలే అంటున్న ఏడు నగరాలు.. రికార్డ్‌ సృష్టించిన హైదరాబాద్‌

దేశంలో గృహాలకు ఎంతో ఆదరణ లభిస్తోంది. ప్రతి ఒక్కరికి సొంతింటి కల నెరవేర్చుకోవాలనేది ఉంటుంది. సొంతింటి కల సకారం చేసుకునేందుకు వడ్డీ రేట్లను సైతం..

Hyderabad Real Estate: గృహాల విక్రయాలలో తగ్గేదిలే అంటున్న ఏడు నగరాలు.. రికార్డ్‌ సృష్టించిన హైదరాబాద్‌
Housing Sales
Follow us
Subhash Goud

|

Updated on: Dec 27, 2022 | 4:45 PM

దేశంలో గృహాలకు ఎంతో ఆదరణ లభిస్తోంది. ప్రతి ఒక్కరికి సొంతింటి కల నెరవేర్చుకోవాలనేది ఉంటుంది. సొంతింటి కల సకారం చేసుకునేందుకు వడ్డీ రేట్లను సైతం లెక్క చేయడం లేదు. అప్పు చేసైనా సొంటింటిని నిర్మించుకోవాలనే ఆరాటంలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో భారతదేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో గృహ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అంతేకాదు.. ఎప్పుడు లేని విధంగతా ఈ ఏడాదిలో గృహ విక్రయాలు ఈ ఏడాదిలో రికార్డు స్థాయిలో నమోదు కావడం గమనార్హం. దీంతో నివాస గృహాల విక్రయాలలో 2014లో నమోదైన రికార్డును ఈ ఏడాది చెరిపేసిందని ప్రాపర్టీ కన్సల్టెంట్‌ అన్‌రాక్‌ తన నివేదికలో పేర్కొంది. అయితే రుణాల వడ్డీ రేట్లు పెరిగినా గృహాలకు డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదని, కరోనా మహమ్మారికి ముందు ఎలా ఉందో అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని తెలిపింది.

2022లో 3,64,900 యూనిట్ల గృహ విక్రయాలు:

2021 సంవత్సరంలో 2,36,500 యూనిట్ల గృహ విక్రయాలు జరుగగా, 2022లో 54 శాతం వృద్ధిలో 3,64,900 యూనిట్ల విక్రయాలు జరిగినట్లు అన్‌రాక్‌ తన నివేదికలో పేర్కొంది. ఈ నివేదికలో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌, బెంగళూరు, పుణె, ముంబై మెట్రోపాలిటిన్‌ రీజియన్‌లను ఉదాహరణగా తీసుకుంది. ఈ ఏడు నగరాల్లో 2014లో 3.43 లక్షల యూనిట్ల గృహాలు అమ్మకాలు జరుగగా, ఇప్పటి వరకు అదే రికార్డు స్థాయి. అయితే తాజాగా జరిగిన విక్రయాలను పరిశీలిస్తే ఆ రికార్డు దాటేసింది.

అత్యధికంగా ముంబై మెట్రో రీజియన్‌లో అమ్మకాలు:

కాగా, ఈ సంవత్సరం అత్యధికంగా ముంబై మెట్రో రీజియన్‌లో అమ్మకాలు జరిగినట్లు అన్‌రాక్‌ తెలిపింది. ఈ ఏడాదిలో 1,09,700 యూనిట్లు అమ్మడైనట్లు పేర్కొంది. ఆ తర్వాత స్థానంలో 63,712 యూనిట్ల గృహాలతో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ఉంది. ఇక బెంగళూరు 49,478 యూనిట్లు, పుణె 57,146 యూనిట్లుగా ఉన్నాయి. ఇక గత సంవత్సరం హైదరాబాద్‌లో 25,406 యూనిట్ల విక్రయాలు జరుగగా, ఈ ఏడాది ఏకంగా 87 శాతం వృద్ది నమోదైంది. అంటే 47,487 యూనిట్ల గృహాల విక్రయాలు జరిగాయి. ఇక చెన్నై 29 శాతం వృద్ధితో 16,097 యూనిట్లు, కోల్‌కతా 21,220 యూనిట్ల గృహాల విక్రయాలు జరిగినట్లు నివేదికలో వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే