EPFO: 6 కోట్లకుపైగా ఈపీఎఫ్‌ ఖాతాదారులకు హెచ్చరిక.. పొరపాటున ఈ వివరాలు చెప్పొద్దు

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) తన 6 కోట్లకుపైగా సభ్యులకు పలు హెచ్చరికలు జారీ చేసింది. ఈ మధ్య కాలంలో సైబర్‌ నేరాలు..

EPFO: 6 కోట్లకుపైగా ఈపీఎఫ్‌ ఖాతాదారులకు హెచ్చరిక.. పొరపాటున ఈ వివరాలు చెప్పొద్దు
EPFO
Follow us
Subhash Goud

|

Updated on: Dec 27, 2022 | 2:58 PM

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) తన 6 కోట్లకుపైగా సభ్యులకు పలు హెచ్చరికలు జారీ చేసింది. ఈ మధ్య కాలంలో సైబర్‌ నేరాలు పెరిగిపోవడంతో ముందస్తుగా అలర్ట్‌ చేస్తోంది. మీరు కూడా ఈపీఎఫ్‌వో సభ్యులైతే అప్రమత్తంగా ఉండటం ఎంతో ముఖ్యం. సైబర్ నేరాల గురించి సభ్యులను అప్రమత్తం చేసింది. పీఎఫ్ ఖాతా పేరుతో అనేక మోసాలు జరుగుతున్నాయిన. మోసగాళ్లు ఈపీఎఫ్‌వో పేరుతో వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని ఫోన్‌ కాల్స్‌, మెసేజ్‌ల ద్వారా అడిగేస్తున్నారు. అటువంటి పరిస్థితిలో ఈపీఎఫ్‌వో సభ్యులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఈమేరకు ఈపీఎఫ్‌వో ట్విట్‌ చేసింది. నకిలీ కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల గురించి జాగ్రత్తగా ఉండాలని, ఈపీఎఫ్‌వో​తన సభ్యులను ఫోన్, ఈ-మెయిల్ లేదా సోషల్ మీడియా ద్వారా వ్యక్తిగత వివరాలను పంచుకోమని ఎప్పుడూ అడగదని సూచించింది. ఈపీఎఫ్‌వో, ఉద్యోగులు ఎప్పుడూ ఎలాంటి సమాచారాన్ని అడగరు. అలాగే యూఏఎన్‌, పాన్‌, పాస్‌వర్డ్‌, బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ, ఆధార్‌, ఆర్థిక వివరాలు ఎవ్వరితోనూ పంచుకోవద్దని హెచ్చరించింది. లేకపోతే తీవ్రంగా మోసపోయే ప్రమాదం ఉందని తెలిపింది. సైబర్‌ నేరగాళ్లు ఈపీఎఫ్‌లో కార్యాలయం నుంచి అంటూ ఫోన్‌లు చేస్తూ మీ వివరాలు తెలుసుకుని మీ ఖాతాలో ఉన్న డబ్బును క్షణాల్లోనే ఖాళీ చేస్తారని హెచ్చరించింది. మీరు అప్రమత్తంగా లేకపోతే తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొవాల్సి ఉంటుందని ఈపీఎఫ్‌వో హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి

పీఎఫ్‌పై 8.1 శాతం వడ్డీ

ఉద్యోగుల పదవీ విరమణ కోసం ఈపీఎఫ్‌వో​పదవీ విరమణ నిధిని సేకరిస్తుందని, దీని కింద కంపెనీ, ఉద్యోగుల తరపున డబ్బు జమ చేయబడుతుందని, ఈపీఎఫ్‌ ఖాతా కింద ఉద్యోగుల ప్రాథమిక జీతంలో 12 శాతం, అదే మొత్తం కంపెనీ నుండి జమ చేయబడుతుందని తెలిపింది. ప్రతి నెలా జమ చేసిన ఈ మొత్తంపై సంవత్సరానికి 8.1% వడ్డీ అందిస్తారు. పదవీ విరమణ వయస్సు వచ్చినప్పుడు మొత్తం ఉద్యోగులకు చెల్లిస్తారు.

వడ్డీ రేటు ఎంత:

ప్రభుత్వం గత మార్చిలో పీఎఫ్ ఖాతాలో డిపాజిట్లపై వడ్డీ రేటును 8.5 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గించింది. దాదాపు 40 ఏళ్లలో ఇదే కనిష్ట వడ్డీ రేటు. ఉద్యోగి జీతంపై 12% మినహాయింపు ఈపీఎఫ్‌ ఖాతా కోసం తీసివేస్తారు. ఉద్యోగి జీతంలో యజమాని చేసిన కోతలో 8.33 శాతం ఈపీఎస్‌ ఉద్యోగుల పెన్షన్ స్కీమ్‌కు చేరగా, 3.67 శాతం ఈపీఎఫ్‌కు చేరుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు