PF Account Balance: ఇంట్లోనే ఉండి ఈ పద్దతుల ద్వారా మీ పీఎఫ్ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవచ్చు.. ఎలాగంటే..
ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులు ఖాతాలో తమ బ్యాలెన్స్‌ను తనిఖీ చేయడానికి ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. టెక్నాలజీ పెరుగుతున్న కారణంగా మీరు..
ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులు ఖాతాలో తమ బ్యాలెన్స్‌ను తనిఖీ చేయడానికి ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. టెక్నాలజీ పెరుగుతున్న కారణంగా మీరు ఇంట్లోనే ఉండి మీ మొబైల్‌లో చెక్ చేసుకోవచ్చు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో)ఆన్‌లైన్ సర్వీస్ పీఎఫ్ బ్యాలెన్స్‌ను తనిఖీ చేసుకోవచ్చు. కొన్ని సులభమైన పద్దతులను అనుసరించి బ్యాలెన్స్‌ను తనిఖీ చేసుకోవచ్చు.
పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకునేందుకు వివిధ మార్గాలు:
- మొబైల్ నుంచి పీఎఫ్ బ్యాలెన్స్: మీ పీఎఫ్ డబ్బును చెక్ చేయడానికి మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 011-22901406కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. దీని తర్వాత, మీరు ఈపీఎఫ్వోనుంచి మెసేజ్ వస్తుంది. ఇందులో మీ పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఓ విషయం గుర్తించుకోవాలి. మీ యూఏఎన్, పాన్, ఆధార్‌ను లింక్ చేయడం తప్పనిసరి. అప్పుడు బ్యాలెన్స్ తనిఖీ చేయడానికి ఆస్కారం ఉంటుంది.
- పీఎఫ్ వెబ్‌సైట్ ద్వారా..: మీరు పీఎఫ్ బ్యాలెన్స్‌ను వెబ్‌సైట్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌కి లాగిన్ కావాలి. epfindia.gov.inలో ఇ-పాస్‌బుక్‌పై క్లిక్ చేయండి. అప్పుడు మీ ఇ-పాస్‌బుక్‌పై క్లిక్ చేస్తే, passbook.epfindia.gov.inకి కొత్త పేజీ వస్తుంది. తర్వాత వినియోగదారు పేరు (యూఏఎన్ నంబర్), పాస్‌వర్డ్, క్యాప్చార్ చేయాలి. అన్ని వివరాలను పూరించిన తర్వాత, మీరు కొత్త పేజీకి వెళ్తారు. ఇక్కడ మీరు సభ్యుల ఐడీని ఎంచుకోవలసి ఉంటుంది. ఇక్కడ మీరు ఇ-పాస్‌బుక్‌లో మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.
- ఉమాంగ్ యాప్ ద్వారా..: అలాగే మీరు పీఎప్ బ్యాలెన్స్‌ను ఉమాంగ్ యాప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. దీని కోసం మీరు మీ ఉమాంగ్ యాప్ ఓపెన్ చేసి ఈపీఎఫ్‌వోపై క్లిక్ చేయండి. తర్వాత మరో పేజీకి వెళ్లిన తర్వాత ఇక్కడ మీరు ‘View Passbook’పై క్లిక్ చేయండి. దీంతో మీరు మీ యూఏఎన్ నెంబర్, పాస్‌వర్డ్ (ఓటీపీ) నంబర్‌ను ఎంటర్ చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత బ్యాలెన్స్ వివరాలు కనిపిస్తాయి.
- యూఏఎన్ నంబర్ లేకుండా ఈపీఎఫ్ బ్యాలెన్స్ తనిఖీ చేయడం ఎలా?: మీరు యూఏఎన్ నెంబర్ లేకుండా పీఎఫ్ బ్యాలెన్స్ తనిఖీ చేసుకోవచ్చు. ముందుగా ముందుగా epfindia.gov.in EPF హోమ్ పేజీకి లాగిన్ కావాలి. తర్వాత మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడానికి ‘ఇక్కడ క్లిక్ చేయండి’పై లింక్‌పై క్లిక్ చేయండి. తర్వాత మీరు epfoservices.in/epfo/కి మళ్లించబడతారు. ఇక్కడ కనిపించే బ్యాలెన్స్ సమాచారంలోకి వెళ్లండి. అందులోమీ రాష్ట్రాన్ని ఎంచుకుని, ఈపీఎఫ్వోఆఫీస్ లింక్‌పై క్లిక్ చేయండి. పీఎఫ్ ఖాతా నంబర్, పేరు, మొబైల్ నంబర్ వంటి వివరాలు నమోదు చేయండి. తర్వాత సబ్మిట్‌పై క్లిక్ చేసిన తర్వాత మీ బ్యాలెన్స్ వివరాలు కనిపిస్తాయి.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి