7th Pay Commission: ఉద్యోగులకు, పెన్షనర్లకు ఆ రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్
ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందింది. ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్, పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్‌ను 12 శాతం పెంచుతున్నట్లు..
ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందింది. ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్, పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్‌ను 12 శాతం పెంచుతున్నట్లు త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సాహా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నూతన సంవత్సర కానుకగా ప్రకటించారు. అయితే ఈ పెంపు డిసెంబర్ 1 నుంచి వర్తిస్తుంది. ఈ నిర్ణయం తర్వాత రాష్ట్ర ఉద్యోగుల డీఏ 8 శాతం నుంచి 20 శాతానికి పెరిగింది.
ఈ ఉద్యోగుల జీతం రెట్టింపు
ఈ నిర్ణయంతో 1,04,600 మంది రెగ్యులర్ ఉద్యోగులు, 80,800 మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుందని రాష్ట్ర సీఎం సాహా మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇది కాకుండా తాత్కాలిక ఉద్యోగులకు కూడా వారి పారితోషికం దాదాపు రెండింతలు పెరిగింది. డీఏ/డీఆర్‌ను 12 శాతం పెంచడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి నెలా రూ.120 కోట్లు, వార్షిక ప్రాతిపదికన రూ.1,440 కోట్ల అదనపు భారం పడుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. వనరుల కొరత ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వేతన నిర్మాణాన్ని సవరించిందని సాహా చెప్పారు. దీంతో లక్షలాది మంది ఉద్యోగులు, వారి కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.
కేంద్ర ఉద్యోగుల డీఏ 4 శాతం పెరగవచ్చు:
మీడియా నివేదికల ప్రకారం, 2023 మొదటి డీఏ పెంపు 4 శాతం ఉండవచ్చు. అంటే 7వ వేతన సంఘం నిబంధనల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ రేటు 42కి పెరగవచ్చు. ఈ పెంపుతో 48 లక్షల మంది ఉద్యోగులతో పాటు 68 లక్షల మంది పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్) రూపంలో పెద్ద ఊరట లభించనుంది. 2022 జనవరిలో 3 శాతం పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ రేటును 31 శాతం నుంచి 34 శాతానికి పెంచారు. 2022లో రెండవ పెంపు డీఏను 4 శాతం పెంచి ఆ సంఖ్యను 38 శాతానికి చేరుకుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి