AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఐసీయూలోనే పెళ్లి చేసుకున్న యువతి.. ఆ నిర్ణయం వెనుక స్టోరీ ఏమిటంటే..

నిజ జీవితంలో హాస్పిటల్‌ల్లో పెళ్లి సీన్‌లను మనం చూడాలనుకున్నా జరగవు. అయితే హాస్పిటల్ ఐసీయూలోనే వివాహం చేసుకుని, నిజ జీవితంలోనూ అలా జరుగుతుందని చేసి చూపింది బిహార్‌కు ఓ ..

Watch Video: ఐసీయూలోనే పెళ్లి చేసుకున్న యువతి.. ఆ నిర్ణయం వెనుక స్టోరీ ఏమిటంటే..
Bihar Girl Marrying In Icu As Her Mothers Last Wish
శివలీల గోపి తుల్వా
|

Updated on: Dec 27, 2022 | 4:59 PM

Share

హాస్పిటల్‌ల్లో పెళ్లి సీన్‌లను మనం సినిమాలలోనే చూస్తుంటాం. నిజ జీవితంలో అలాంటి దృశ్యాలను మనం చూడాలనుకున్నా జరగవు. అయితే హాస్పిటల్ ఐసీయూలోనే వివాహం చేసుకుని, నిజ జీవితంలోనూ అలా జరుగుతుందని చేసి చూపింది బిహార్‌కు చెందిన ఓ యువతి. కొంత కాలంగా ఆనారోగ్యం కారణంగా బాధపడుతున్న పూనమ్ కుమారి వేర్మ ఇటీవలే  తన తల్లి చివరి కోరికను నెరవేర్చుందుకు  బిహార్‌కు చెందిన ఆశా సింగ్ మోడ్ మెజిస్ట్రేట్ కాలనీ సమీపంలోని ఆర్ష్ ఆసుపత్రిలో అడ్మిట్ అయింది. ఆమె ఆరోగ్యం విషమించడంతో వేర్మ ఎప్పుడైనా చనిపోవచ్చని ఆర్ష్ ఆసుపత్రి వైద్యులు తెలియజేశారు. దీంతో ఆమె తాను చనిపోవడానికి ముందుగానే కుటుంబ సభ్యులు, కూతురుకు తన చివరి కోరిక గురించి చెప్పింది. ఆమె కోరిన కోరిక ప్రకారం తన కూతురు చాందిని వేర్మకు తాను బతికుండగానే పెళ్లి చేయాలి.

ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. చాందిని వేర్మకు ముందుగానే పెళ్లి నిశ్చయం అయింది. ఆ పెళ్లి ముహూర్తానికి కేవలం ఒక్క రోజు మిగిలి ఉన్నప్పుడే పూనమ్ కుమారి వేర్మ తనకు ఉన్న ఈ కోరికను తెలియజేశారు. దీంతో తల్లి కోరిక మేరకు చాందిని డిసెంబరు 26న సుమిత్ గౌరవ్‌తో కుమారి వివాహం చేసుకుంది. అమ్మాయి తల్లి పట్టుబట్టడంతో ముందుగా నిశ్చయించిన పెళ్లి తేదీకి ఒకరోజు ముందే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే చాందిని పెళ్లయిన రెండు గంటలకే పూనమ్ కుమారి వేర్మ చనిపోయింది.

ఇవి కూడా చదవండి

చాందిని వివాహానికి సంబంధించిన వీడియో.. 

కాగా, పూనమ్ కుమారి వేర్మ మగద్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ANM గా పనిచేస్తున్నారు. కరోనా కాలం నాటి నుంచి ఆనారోగ్యంతో ఉన్న ఆమె గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. తల్లి కోరిక తీర్చేందుకు ఆస్పత్రిలోనే కూతురు పెళ్లి చేసుకుంది. ఈ ఘటన ఆర్ష్ ఆసుపత్రి సిబ్బందిని కూడా కంటతడి పెట్టించింది. ఆ కుటుంబంలో సంతోషంతో పాటు దుఃఖం కూడా ఒకే సారి ప్రవేశించింది.  ఐసీయూలో జరిగిన పెళ్లికి సంబంధించిన వీడియోను ఓ యూట్యూటర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా అది ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు చాందినిని ఎంతగానో ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.