Kerala Bride: ఎవడి పెళ్లికి వాడే వాయించుకోవడం అంటే ఇదేనేమో.. బ్యాండ్‌ బృందంతో కలిసి తన టాలెంట్ చూపించిన వధువు..

వధూవరులే తమ పెళ్లిలో డాన్సులతో హోరెత్తిస్తున్నారు. రకరకాల చిలిపి చేష్టలతో రెచ్చిపోతున్నారు. సదరు వీడియోలను నెట్టింట పోస్ట్‌ చేస్తూ తమ వివాహ ఘట్టాన్ని మధురజ్ఞాపకంగా మలచుకుంటున్నారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది.

Kerala Bride: ఎవడి పెళ్లికి వాడే వాయించుకోవడం అంటే ఇదేనేమో.. బ్యాండ్‌ బృందంతో కలిసి తన టాలెంట్ చూపించిన వధువు..
Kerala Bride Video Viral
Follow us

|

Updated on: Dec 27, 2022 | 4:53 PM

భారత దేశంలో పెళ్లంటే ఓ రేంజ్ లో సాగుతాయి. పెళ్లింట.. బంధువుల హడావిడి, చిన్నారులు, యువత సందడి.. డ్యాన్సులు, ఆటలు, పాటలు ఇలా ఎవరికి నచ్చినట్టు వారు సందడి చేస్తుంటారు. అయితే ఇటీవల ట్రెండ్‌ మారింది. వధూవరులే తమ పెళ్లిలో డాన్సులతో హోరెత్తిస్తున్నారు. రకరకాల చిలిపి చేష్టలతో రెచ్చిపోతున్నారు. సదరు వీడియోలను నెట్టింట పోస్ట్‌ చేస్తూ తమ వివాహ ఘట్టాన్ని మధురజ్ఞాపకంగా మలచుకుంటున్నారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది.

కేరళలోని ప్రసిద్ధ గురువయూర్‌ ఆలయంలో డిసెంబర్‌ 26న ఓ వివాహ వేడుక జరిగింది. కాసేపట్లో పెళ్లి తంతు మొదలవుతుందనగా.. వధువు అందంగా ముస్తాబై మండపానికి చేరుకుంది. అక్కడ డ్రమ్స్‌ వాయిస్తున్న బ్యాండ్‌ బృందాన్ని చూసింది. అంతే పెళ్లి పీటలెక్కాల్సిన వధువు బ్యాండ్‌ బృందం దగ్గరకు పరుగెత్తింది. వారితో చేరి తాను ఓ ఛెండాను మెడలో వేసుకుని వాయించడం మొదలుపెట్టింది. ఆ వధువు ఛెండాను ఎంతో ఉత్సాహంగా వాయిస్తూ అందరినీ ఆకట్టుకుంది. మధ్యలో వరుడు, వధువు తండ్రి కూడా జత కలిసారు. వారుకూడా బ్యాండ్‌ బృందంలోకి వచ్చి సందడి చేశారు.

ఇవి కూడా చదవండి

వధువు సందడి 

ఆమె తండ్రి చాలా ఏళ్లుగా చెండా మాస్టర్‌గా పని చేస్తున్నాడు. వివాహ సమయంలో వధువు.. తండ్రి సంగీత పరికరంతో తన ట్యాలెంట్‌ను చూపెట్టింది. ఈ సందడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు పెళ్లి కుమార్తె ఛెండా వాయిస్తున్న తీరు చూసి ఆమెను మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ